రిలీజ్‌కు ముందే ర‌వితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు భారీ ఎదురుదెబ్బ..!

రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వాడిన భాష ఓ వర్గానికి కించపరిచేలా ఉందని హైకోర్టు పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ అనుమతి లేకుండా టీజర్ రిలీజ్ చేశారని అబ్జ‌క్ష‌న్‌ పెట్టిన హైకోర్ట్‌.. కావాల్సిన అనుమతులు తీసుకోకుండా టీజర్ ఎలా విడుదల చేశారంటూ ప్రశ్నించింది. ఇలాంటి టీజ‌ర్‌తో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటూ మండిపడింది.

Tiger Nageswara Rao' pre-look: Ravi Teja looks like a badass | Telugu Movie  News - Times of India

సమాజం పట్ల కాస్త బాధ్యతగా ఉండాలని హైకోర్టు పేర్కొంది. డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంగా సినిమాల నిర్మాణం చేస్తున్నారని.. ఈ మేరకు టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత అభిషేక అగర్వాల్‌కు నోటీసులు పంపించింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్‌ సర్టిఫికేషన్ చైర్ పర్సన్‌ను ప్రతివాదిగా చేరాలని పిటిషనర్ కు క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాపై అభ్యంతరాలు అన్నిటిని సీబీఎస్సీ చైర్పర్సన్ కు తెలియజేయ‌టానికి పిటీషనర్ కు అనుమతి ఇచ్చింది.

Tiger Nageswara Rao's fierce and majestic first look launched!

ఇక నెక్స్ట్ ఇంట్రాగేషన్ సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఏ నేపద్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్‌ఠాగూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి ధర్మాసనం.. బుధవారం నోటీసులు పంపించింది. ఈ సినిమా టీజర్ ఎరుకుల సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటే చుక్కా పాల్‌రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో ఫీల్ దాఖలా చేశాడు. ఇందులో భాగంగా సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపి టీజర్‌లోని భాష పై అబ్జెక్షన్ తెలిపింది.