సిక్కోలులో టీడీపీ అభ్యర్ధులు వీరే..వారికే డౌట్.!

ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..ఎన్నికల్లో గెలవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహా-ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అలాగే ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఖరారు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ అంశంలో టి‌డి‌పి కాస్త ముందుంది. చంద్రబాబు గతంలో మాదిరిగా కాకుండా ముందే అభ్యర్ధులని ప్రకటించాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేశారు. అధికారికంగా ప్రకటించలేదు..కానీ దాదాపు అభ్యర్ధులు ఫిక్స్ అని చెప్పవచ్చు.

ఇదే క్రమంలో టి‌డి‌పికి కంచుకోట అయిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టి‌డి‌పి అభ్యర్ధులు ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆయా సీట్లలో పెద్ద మార్పులు ఉండవని తెలుస్తోంది. మొదట టి‌డి‌పి కంచుకోట ఇచ్చాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ పోటీ చేయడం ఖాయం..ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇటు టెక్కలి బరిలో అచ్చెన్నాయుడు పోటీ చేయనున్నారు. పలాసలో గౌతు శిరీష, ఆమదాలవలసలో కూన రవికుమార్ పోటీ చేస్తారు. ఈ సీట్లలో ఎలాంటి మార్పులు లేవు. శ్రీకాకుళం అసెంబ్లీలో గుండా లక్ష్మీ పోటీ చేయడం దాదాపు ఫిక్స్.

అటు పాతపట్నంలో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావుల మధ్య పోటీ ఉంది..కానీ ఈ సారి కలమటకు లేదా ఆయన తనయుడుకు 90 శాతం సీటు గ్యారెంటీ. ఇటు రాజాంలో కొండ్రు మురళీమోహన్ పోటీ చేస్తారు. అటు ఎచ్చెర్లలో పోటీ ఉంది..కానీ దాదాపు సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుకు సీటు ఖాయం. ఇక్కడ వరకు అన్నీ సీట్లు ఖాయమనే చెప్పవచ్చు.

కానీ నర్సన్నపేట, పాలకొండ సీట్ల విషయం క్లారిటీ లేదు. ప్రస్తుత ఇంచార్జ్‌లు బగ్గు రమణమూర్తి, నిమ్మక జయకృష్ణలకు సీటు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.