మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి `భోళా శంకర్`. రెండు సినిమాల్లోనూ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధితో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే జైలర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తుంటే.. భోళా శంకర్ డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తనకున్న బాండింగ్ ను బయటపెట్టింది. వీరిద్దరూ రచ్చ మూవీలో జంటగా నటించారు. చేసింది ఒక సినిమానే చరణ్, తమన్నా మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. ఎప్పుడు ఒత్తిడిగా ఉన్నా.. మూడ్ బాగోగపోయినా తమన్నా నుంచి ఫస్ట్ కాల్ చరణ్ కే వెళ్తుందట.
అతను ఎంత బిజీగా ఉన్నా తమన్నా కాల్ వెంటనే లిప్ట్ చేస్తాడట. చాలా కూల్ గా మాట్లాడుతూ.. లైఫ్ కి సంబంధించి ఎన్నో విలువైన సలహాలు, సూచనాలు ఇస్తాడట. చరణ్ తో మాట్లాడుతుంటే టైమ్ తెలియని.. ఎంత ఒత్తిడి అయినా ఇట్టే మాయం అవుతుందని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ తో మాట్లాడితే మనసు కుదుట పడుతుందని తమన్నా పేర్కొంది. ఇక ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ కాజల్ అగర్వాల్ అని మిల్కీ బ్యూటీ వెల్లడించింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.