మెగాస్టార్ చిరంజీవి తాజాగా `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం.. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ కూడా మెప్పించలేకపోయింది.
దీంతో బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ కలెక్షన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 15.38 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం.. రెండో రోజు కేవలం రూ. 3.13 కోట్లతో సరిపెట్టుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 3.60 కోట్ల షేర్ ను వసూల్ చేసి తీవ్రంగా నిరాశ పరిచింది.
రూ. 80.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన భోళా శంకర్.. రెండు రోజుల్లో రూ. 21.98 కోట్ల షేర్, రూ. 34.20 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇంకా రూ. 58.52 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంటే.. భోళా శంకర్ క్లీన్ హిట్ అవుతుంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భోళా శంకర్ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని అంటున్నారు. కాగా, ఏరియాల వారీగా భోళా శంకర్ 2 డేస్ టోటల్ కలెఓన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం: 5.64 కోట్లు
సీడెడ్: 2.52 కోట్లు
ఉత్తరాంద్ర: 2.39 కోట్లు
తూర్పు: 1.53 కోట్లు
పశ్చిమ: 1.97 కోట్లు
గుంటూరు: 2.32 కోట్లు
కృష్ణ: 1.24 కోట్లు
నెల్లూరు: 90 లక్షలు
—————————–
ఏపీ+తెలంగాణ= 18.51కోట్లు(27.45కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 1.35 కోట్లు
ఓవర్సీస్: 2.12 కోట్లు
—————————
వరల్డ్ వైడ్ కలెక్షన్స్= 21.98కోట్లు(34.20కోట్లు~ గ్రాస్)
—————————