శ్రీదేవిని డూడుల్‌తో గౌరవించిన గూగుల్.. ఇలా ఇదే మొదటిసారి..!

తమిళనాడులో పుట్టి పెరిగిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగ‌ర్ అయ్యప్పన్. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత శ్రీదేవిగా మార్చుకుంది. టీనేజ్‌లోనే హీరోయిన్ అయిపోయిన శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో రికార్డులను ద‌క్కించుకున్న‌ శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఈమెకు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించింది. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం అందింది. దివంగత నటి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంది. ఈరోజు శ్రీదేవి 60వ బర్త్‌డే సందర్భంగా ఆమెకు గూగుల్ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.

గూగుల్ డూడుల్‌గా శ్రీదేవి ఇమేజ్‌ని పబ్లిష్ చేసింది. దేవత సినిమాలో ఎలోవ‌చ్చే గోదారమ్మ పాటలో ఓ సీన్లో శ్రీదేవి పెట్టిన స్టిల్ ఈరోజు ఉదయం నుంచి గూగుల్ హోమ్‌పేజ్ లో డూడుల్‌గా మనకి కనిపిస్తుంది. ముంబైకి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ భూమిక ముఖర్జీతో గూగుల్ ఈ ఇలస్ట్రేషన్ గీయించింది. ఇక ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల దేవర సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2024 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.