ఏజెంట్.. భోళా శంకర్ సినిమా దెబ్బకి అన్ని కోట్లు నష్టపోయిన నిర్మాత..!!

 టాలీవుడ్ లో మోస్ట్ బిగ్గెస్ట్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయన ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది.. అయితే ఆ సినిమా ఆశించినంత సక్సెస్ కాలేక పోయింది. అంతకుముందు ఏప్రిల్ నెలలో అఖిల్ నటించిన ఏజెంట్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ రెండు చిత్రాలలో హీరోలు, డైరెక్టర్లు వేరు కానీ నిర్మాత మాత్రం ఒక్కరే.. ఆయనే అనిల్ సుంకర.అయితే ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కాకుండా డిజార్డర్ గా మిగిలాయి. ఈ సినిమాల వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారట వాటి గురించి తెలుసుకుందాం.

మొదటగా ఏజెంట్ బడ్జెట్ దాదాపు రూ .70 కోట్లు. అన్ని కోట్లు ఖర్చు పెడితే రూ .12 నుంచి రూ .13 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ రిలీజ్ మాటే లేదు.. దీంతో దాదాపుగా ఏజెంట్ చిత్రానికి రూ.55 కోట్లు నష్టం..మరి ఓటిటి విషయంలో ఎందుకు ఆలస్యం తెలియడం లేదు.

Anil Sunkara | తెలుగు360

ఇక భోళా శంకర్ సినిమా బడ్జెట్ పరంగా రూ .101 కోట్లు పెట్టారు ఫస్ట్ డే రూ .28 కోట్లు కలెక్షన్ చేసింది. ఈ సినిమాకి ఇంక రూ .75 కోట్లు కాబట్టాలి ఈ సినిమా పరిస్థితి చూస్తూ ఉంటే రూ.50 రావటం కష్టమే.. చిరంజీవి కూడా ఈ సినిమా డిజార్డర్ ని తప్పించలేదని నేషనల్ మీడియా తెలుపుతుంది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు కాకపోవటం..

రెండు దారుణమైన సినిమాల మధ్యలో ఆ ప్రొడ్యూసర్కు కాస్త ఊరట కలిగించే సినిమా ఏంటంటే సామజవరగమన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ రెండు చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా కాస్త బెటర్ అని చెప్పవచ్చు.. దీంతో ఈ రెండు చిత్రాలతో దాదాపుగా రూ.130 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది.