మరొకసారి ప్రేమలో పడ్డ సమంత .. పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నది. ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత సమంత ఒక ఏడాది గ్యాప్ సినిమాలకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సమంత అటు అభిమానులతో అప్పుడప్పుడు పలు విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

Samantha Ruth Prabh news: Samantha Ruth Prabhu walks out of Bollywood  films; Is the actor going on long break? Read here - The Economic Times

మరొకపక్క నిత్యం ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు తోచిన విధంగా మనోభావాలను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నాగచైతన్య తో విడిపోయాక సమంత ఎంతో వేదన అనుభవించింది.. ప్రస్తుతం ఆ వేదన నుంచి బయటపడేందుకు పలు రకాల మార్గాలను ఎంచుకుంటోంది సమంత. తాజాగా తనకు ఒక కొత్త ప్రేమ దొరికిందని సమంత తెలియజేయడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది.. అయితే ఆ వ్యక్తి ఎవరో అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు.

కానీ సమంత ప్రేమలో పడింది ఒక వ్యక్తితో కాదు నీటితో.. సమంత మెరుస్తున్నటువంటి నీటిలో తనకు ఒక కొత్త లవ్ కనుగొన్నానని తెలియజేసింది.. ఒక గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసుకొని వాటర్ ను చేతో పట్టుకొని మెరిసేటువంటి నీటిలో తన కొత్త ప్రేమను కనుగొన్నాను అంటూ కొత్త అంశాలతో కొత్త ఆవిష్కరణలు కూడా వస్తున్నాయి అంటూ ఒక లవ్ ఎమోజిని యాడ్ చేయడం జరిగింది సమంత.. దీంతో అభిమానులు మాత్రం సమంత నీ మనసు చాలా స్వచ్ఛమైనది.. నీకు దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.