బిగ్‌బాస్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. సీజ‌న్ 7 ప్రారంభోత్స‌వానికి డేట్ ఫిక్స్‌!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్‌. ఇప్ప‌టికే ఈ షో అనేక భాష‌ల్లో ప్ర‌సారం అవుతోంది. తెలుగులో కూడా బిగ్ బాస్ ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. అయితే గ‌త రెండు సీజ‌న్లు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో సీజ‌న్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. `న్యూ రూల్స్‌, న్యూ ఛాలెంజెస్‌, న్యూ బిగ్‌బాస్‌, ఈసారి ఉల్టా పల్టా` అంటూ బిగ్ బాస్ 7ను తెగ ప్ర‌మోట్ చేస్తున్నారు.

గ‌త నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే.. ఈసారి కూడా హోస్ట్ చేయ‌బోతున్నారు. మ‌రోవైపు కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ నెట్టింట కొందరు పేర్లు సైతం తెగ చక్క‌ర్లు కొడుతున్నాయి. అయితే షో ప్రారంభం అయ్యేది ఎప్పుడు తెలియ‌ని బిగ్ బాస్ ల‌వ‌ర్స్ గ‌త కొద్ది రోజుల నుంచి జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా వారికి బిగ్ బాస్ నిర్వాహ‌కులు గుడ్‌న్యూస్ చెప్పారు.

సీజ‌న్ 7 ప్రారంభోత్స‌వానికి డేట్ ఫిక్స్ చేసి అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 3వ తేదీ నుండి బిగ్ బాస్ లేటెస్ట్ సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. ఈ మేర‌కు నిర్వాహ‌కులు సోష‌ల్ మీడియా ద్వారా అధికారిక ప్ర‌మోను విడుద‌ల చేసింది. ఇక నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే..ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్, నటి నవ్యస్వామి, జబర్దస్త్ వర్ష, యాంకర్ వర్షిణి, యూట్యూబర్ అనిల్ గీలా, సింగర్ మోహన భోగరాజు, ఆట సందీప్, జబర్దస్త్ నరేశ్ త‌దిత‌రులు బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొన‌బోతున్నార‌ని తెలుస్తోంది.