ఖుషి ప్రి రిలీజ్ బిజినెస్.. విజ‌య్ ఈ అరాచాకం ఏంది సామీ..!

విజయ్ దేవరకొండ – సమంత రూత్ ప్రభు కలిసి జంటగా నటించిన మూవీ ఖుషి. శివ నిర్వాణ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఒక ఆంధ్ర ఏరియాలోనే రూ.22 కోట్ల బిజినెస్ జరిగిందట. అంటే విశాఖ ఏరియాకు రూ.5కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. మైత్రి రెగ్యులర్ బయ్యర్లకే సినిమా ఇచ్చారు. నైజాం ఏరియాలో మాత్రం సొంతగా పంపిణీ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లతో పాటు, పాటలు కూడా రిలీజై బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. డైరెక్టర్ శివనిర్వాణకు కూడా మంచి సక్సెస్ రేట్ ఉంది. ఇక గీతగోవిందం తర్వాత విజయ్ ఎటువంటి స్పెషల్ జానర్‌ కాకుండా పక్క లవ్ ఫ్యామిలీ జానర్లో చేయడం ఇదే కావడంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. వాటితో పాటే సమంత – విజయ్ జంట చాలా బాగుందని ఈ లవ్ ఎంటర్టైన ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుందంటూ సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ లీక్ అవడంతో ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి హైప్‌ వచ్చింది.

వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓపెనింగ్స్‌లో మంచి కలెక్షన్స్ వస్తాయని మూవీ టీం నమ్ముతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు రెండు వారాలు, వెనక ఒక వారం సరైన సినిమా ధియేటర్లే ఉండవు. ప్రస్తుతం థియేటర్లో టైట్ గానే ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ టైం కి అయితే థియేటర్స్ ఖాళీ అవుతాయి. అందువల్ల మాక్సిమమ్‌ ఓపెనింగ్స్ రాబడుతుంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన సినిమా కొనసాగుతుంది.