టాప్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్ట‌ర్ శంక‌ర్ కూతురు అదితి…?

దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ ఎదుగుదల మామూలుగా లేదు. కార్తీక్‌కి జంటగా విరుమాన్ సినిమాతో కథానాయకిగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తరువాత శివ కార్తికేయ సరసన మూవీరన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విఝవర్థన్ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాష్ మురాళికి జంటగా నటిస్తుంది. కాగా తదుపరి రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ తాజా చిత్రంలో నటించడానికి అదితి శంకర్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఒకప్పుడు నటుడు సూర్యతో జత కట్టడానికి సిద్ధమవుతుందని వార్తలు వినిపించాయి. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ చారిత్రాత్మక కథ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా సాగుతుంది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు సుధా కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటించింది. ఈ సినిమాలో న‌టించిన సూర్య జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాడు.

ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇది సూర్య నటించే 43వ సినిమా అవుతుంది. ఇందులో ఆయనకు జంటగా నటి అదితి శంకర్ నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కార్తీ తో నటించి విజయాన్ని అందుకున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్యతో నటించడానికి రెడీ అయింది. మరో విషయం ఏమిటంటే నటుడు సూర్య దర్శకుడు లోకేష్ కనగ‌రాజన్ ద‌ర్సకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.