బాబు పాలన బెటర్..పవన్‌కు 2019 సీన్ రిపీట్ కావాలా?

రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ తక్షణమే అధికారంలో నుంచి దిగిపోవాలి..వైసీపీ  వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..టి‌డి‌పితో కలిసి పొత్తులో పోటీ చేస్తాం..బి‌జే‌పి కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా జగన్‌ని గద్దె దించడమే తన ధ్యేయమని జనసేన అధినేత పవన్ పదే పదే చెబుతున్నారు. అంటే టి‌డి‌పితో కలిసి వెళ్లడానికి పవన్ రెడీ అయ్యారు. అది కూడా జగన్ ని ఓడించడం కోసమే.

అయితే జగన్ మంచి పాలన అందిస్తే..ఇవన్నీ ఉండేవి కాదని, తానే మద్ధతు ఇచ్చేవాడినని, జగన్ పాలన దోపిడీలు, అక్రమాలు పెరిగాయని, తనకు వైసీపీ కంటే టి‌డి‌పి పాలన బెటర్ అనిపించిందని తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇక ఇక్కడ పవన్ రాజకీయం ఎలాగైనా చేసుకోవచ్చు. అందులో తప్పు లేదు..కానీ ఒకవేళ టి‌డి‌పి పాలన అద్భుతంగా ఉంటే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోదు..ఆ విషయం పవన్ ఎందుకు మర్చిపోతున్నారో అర్ధం అవ్వడం లేదు. అదే సమయంలో ఇప్పుడు జగన్ పాలన బాగుందో లేదో..ప్రజలకు బాగా తెలుసు.

ఎందుకంటే ఇప్పుడొచ్చే ప్రతి సర్వేలోనూ ప్రజా మద్ధతు జగన్‌కే ఉందని తెలుస్తోంది. దీంతో జగన్‌ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అంటే ప్రజా మద్ధతు ఉంటే..ఇంకా జగన్ పాలన బాగున్నట్లే కదా..అదే బాగోకపోతే ప్రజలు జగన్‌కు మద్ధతు ఇవ్వరు. ఈ చిన్న లాజిక్ పవన్ మర్చిపోయి..టి‌డి‌పి పాలన బెటర్ అని చెబుతూ..రాజకీయంగా చంద్రబాబుని సి‌ఎం చేయడం కోసం పవన్ తాపత్రయ పడుతున్నారా? అనే పరిస్తితి.