వేపాకుతో ఇన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చా… అస‌లు ట్యాబ్లెట్లే అక్క‌ర్లేదు..!

వేపాకులను మన పూర్వికులు కాలంలో నుంచి దివ్య ఔషధాలకు ఉపయోగిస్తూ ఉండేవారు. ఎన్నో అనారోగ్య వ్యాధులకు పరిష్కారంగా వేపాకుని ఉపయోగించేవారు. వేప చెట్టు లోని కాండం, బెరడు, ఆకులు, పూత, వేప గింజలు ఎలా ఇందులోని ప్రతి ఒకటి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ రకాల చర్మ సమస్యలను తగ్గించడంలోనూ, దంత సమస్యను దూరం చేయడంలోనూ వేపాకు ఎంతగానో ఉపయోగిస్తారు. ప్రతిరోజూ లేత వేపాకులను టీ లో వేసి మరిగించి తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు.

దీంతో జీర్ణ వ్యవస్థ సాఫీగా జరుగుతుంది. వేపాకులను బెండపెట్టి పొడిగా చేసుకుని ఒక స్పూన్ వేప పౌడర్ లో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా శరీరంలో ప్రవేశించి హానికమైన వ్యాధుల‌ని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. మధుమేహం ఉన్నవారికి వేపాకు పొడి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం , సాయంత్రం భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వేప పొడి వేసుకుని తాగితే ఎటువంటి సమస్యలు ఎదురవ్వవు.

అలాగే గజ్జి, తామర, దురద, ఎలర్జీ వంటి చర్మ సమస్యలను పోగొట్టడంలో వేపాకు ఎంతో ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు. అందుకే వేపాకు పుల్లలతో పూర్వకాలంలో బ్రష్ చేసేవారు. ఇలా చేయడం వల్ల దంతాలకు కూడా ఎటువంటి సమస్య రాకుండా దృఢంగా ఉంటాయి. అందువల్ల వేపాకు పొడిని కానీ, స్నానం చేసేటప్పుడు నీళ్లలో వేసుకుని చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు.