అల్లు అర్జున్ ఛీ కొట్టిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఎన్టీఆర్‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదో తెలుసా?

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన‌ క‌థ‌తో మ‌రొక హీరో సినిమా చేయ‌డం స‌ర్వ సాధార‌ణం. ఒక క‌థ‌ను రిజెక్ట్ చేశారు అంటే దాని వెన‌క ఎన్నో కార‌ణాలు ఉంటాయి. క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం, స్క్రిప్ట్ గొప్ప‌గా ఉండ‌క‌పోవ‌డం, డైరెక్ట‌ర్ ప‌నిత‌నంపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డం, డేట్స్, రెమ్యున‌రేష‌న్‌.. ఆల్మోస్ట్ ఈ కార‌ణాల‌తో హీరోలు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన క‌థ‌ల‌ను వ‌దులుకుంటూ ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా త‌న కెరీర్ లో చాలా క‌థ‌ల‌ను రిజెక్ట్ చేశాడు.

అయితే గ‌తంలో ఈయ‌న ఛీ కొట్టిన క‌థ‌తోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇంత‌కీ ఈ సినిమా మ‌రేదో కాదు.. `అరవింద సమేత వీర రాఘవ`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. జగపతి బాబు, నాగ‌బాబు, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 30 సంవత్సరాలుగా వైరానికి గురవుతున్న రెండు గ్రామాల మధ్య శాంతిని నెలకొల్పడానికి హీరో ఏం చేశాడు అన్న‌దే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

2018లో విడుద‌లైన ఈ చిత్రం ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. రూ. 40 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రం.. ఫుల్ ర‌న్ లో రూ. 150 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి దుమ్ము దుమారం లేపింది. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు ఫ‌స్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదు. త్రివిక్ర‌మ్ మొద‌ట ఈ సినిమాను అల్లు అర్జున్ తో చెయ్యాల‌ని అనుకున్నాడ‌ట‌. అల్లు అర్జున్ ను క‌లిసి క‌థ కూడా చెప్పాడ‌ట‌. అయితే స్టోరీలో ఏవో లోపాలు ఉన్న‌ట్లు ఆయ‌న‌కు అనిపించ‌డంతో.. సున్నితంగా ఆయ‌న డేట్స్ ఖాళీగా లేవ‌ని చెప్పి నో చెప్పాడ‌ట‌. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చింద‌ట‌. అలా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో ఎన్టీఆర్ భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.