`టైగర్ నాగేశ్వరరావు` ను సిల్లీ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి త్వ‌ర‌లోనే రాబోతున్న భారీ యాక్ష‌న్ డ్రామా `టైగర్ నాగేశ్వరరావు`. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మింస్తున్నారు. 1970ల్లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.

నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. రేణు దేశాయ్‌, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబర్ 20న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన టైగర్ నాగేశ్వరరావు టీజ‌ర్‌.. సినిమాపై అంచ‌నాల‌ను పీక్స్ కు తీసుకెళ్లింది. టీజ‌ర్ లో ర‌వితేజ‌కు ఇచ్చిన ఎలివేష‌న్స్ నెక్స్ట్ లెవ‌ల్ అనే చెప్ప‌వ‌చ్చు. ఈ మూవీతో ర‌వితేజ భారీ హిట్ అందుకుంటాడ‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

టీజ‌రే ఈ రేంజ్ లో ఉందంటే.. సినిమా పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము లేపే స్థాయిలో ఉంటుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇక‌పోతే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. టైగర్ నాగేశ్వరరావుకు ఫ‌స్ట్ ఛాయిస్ ర‌వితేజ కాద‌ట‌. ఆయ‌న కంటే ముందు టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ వ‌ద్ద‌కు ఈ ప్రాజెక్ట్ వెళ్ల‌గా.. సిల్లీ రీజ‌న్ తో రిజెక్ట్ చేశాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు ప్ర‌భాస్‌. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్ ప్ర‌భాస్ ను హీరోగా పెట్టి మ‌రింత భారీ బ‌డ్జెట్ తో ఓ మూవీని నిర్మించాల‌ని అనుకున్నార‌ట‌. కానీ, ప్ర‌భాస్ మాత్రం మ‌రో నాలుగేళ్లు త‌న డేట్స్ ఖాళీగా లేవ‌ని చెప్పి సున్నితంగా టైగ‌ర్ నాగేశ్వరరావును రిజెక్ట్ చేశాడ‌ట‌. అలా ప్ర‌భాస్ నుంచి చేజారిన ఈ ప్రాజెక్ట్ ర‌వితేజ‌కు చెంత‌కు చేరింద‌ని అంటున్నారు.