ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ వ్యాధి వ‌ల్ల న‌ర‌కం అనుభ‌వించాడ‌ని మీకు తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆ కటౌట్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చిరంజీవి సతీమణి సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తొలి సినిమాతో త‌డ‌బ‌డినా, ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా అర‌డ‌జ‌న్ హిట్ల‌ను కాతాలో వేసుకుని అంద‌రి చూపులు త‌న‌వైపుకు త‌ప్పికున్నాడు. కెరీర్ ఆరంభంలో డ‌బుల్ హ్యాట్రిక్స్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు.

అలాగే త‌నదైన స్టైల్‌, మ్యాన‌రిజ‌మ్స్ తో యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప‌వ‌ర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ప‌వ‌న్‌.. అన్న‌ను మించిన త‌మ్ముడిగా ఎదిగాడు. ప్ర‌స్తుతం ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చాలా మందికి ఓ విష‌యం తెలియ‌దు. అదేంటంటే.. ఒక‌ప్పుడు ఆయ‌న ఓ వ్యాధి వ‌ల్ల న‌ర‌కం అనుభ‌వించాడు.

అవును, స్కూల్ లో చ‌దువుకుంటున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్త‌మా బారిన ప‌డ్డారు. ఆ వ్యాధి వ‌ల్ల ఆయ‌న చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నార‌ట‌. ఆస్త‌మా ల‌క్ష‌ణాల వ‌ల్ల త‌ర‌చూ హాస్ప‌ట‌ల్ లో అడ్మిట్ అయ్యే ప‌రిస్థితి వ‌చ్చేది. దాంతో స్కూల్ కు వెళ్ల‌లేక‌పోయేవాడు. ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. మ‌రోవైపు ప‌రీక్ష‌ల ఒత్తుడి. ఇవ‌న్నీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను తీవ్ర‌మైన డిప్రెష‌న్ లోకి నెట్టేశాయి. ఆ డిప్రెష‌న్ లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఒకానొక టైమ్ లో చ‌నిపోవాల‌ని కూడా అనుకున్నాడు. కానీ, ఎలాగోలా డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఒంట‌రిత‌నాన్ని మ‌ర్చిపోవ‌డానికి పుస్తకాలు చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాడు. ఏ విష‌యాన్ని అయినా సొంతంగా నేర్చుకోవ‌డం అల‌వాటు చేసుకున్నాడు. కొద్ది రోజుల‌కు ట్రీట్‌మెంట్ ద్వారా ఆస్త‌మాను కూడా జ‌యించాడు. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందాడు. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి టాప్ హీరోగా ఎదిగాడు.