చిరంజీవి- హైపర్ ఆది పై.. షాకింగ్ ట్వీట్ చేసిన వర్మ..?

 కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ తాజాగా చిరంజీవి ,హైపర్ ఆది పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది.. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడడం జరిగింది. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పీచ్ మెగా అభిమానులను బాగానే ఆకట్టుకున్న కొన్నిసార్లు చిరాకు తెప్పించిందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాలో హైపర్ ఆది స్పీచ్ వైరల్ గా మారింది.

ఈ స్పీచ్ విన్న వారిలో వర్మ కూడా ఉన్నారు.అయితే భోళా శంకర్ ఫలితాన్ని ఉద్దేశించి వర్మ కాస్త వెటకారంగా ఈసారి ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భోళా శంకర్ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు మెహర్ రమేష్ బాగా నిరాశ పరిచారని వాల్తేరు వీరయ్య తర్వాత మరో సక్సెస్ అవుతుందనుకున్న ఈ సినిమా ఆ రేంజ్ లో లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలోనే వర్మ” బజర్ హైపర్ లాంటి ఆస్థాన విభీషకుల భజన పొగడ్తలకి అలవాటు పడిపోయిన మెగా కుటుంబం రియాలిటీ కి దూరం అవుతోందని పిస్తోందని ట్వీట్ చేశారు. మరో ట్విట్ లో పొగడ్తలతో ముంచే వాళ్ల బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు రియాల్టీ తెలిసే లోపల రాజుగారు మునిగిపోతారు.. వారి పొగడ్తల విషయం నుంచి తప్పించుకోవాలి అంటే వాటికి ఒక మైలు దూరం పెట్టడమే అంటూ చిరంజీకి సలహా ఇచ్చారు వర్మ.. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా వర్మ చెప్పింది కొంతమంది నిజమే అని అంటూ ఉండగా మరి కొంతమంది హైపర్ ఆది వల్ల ఈ సినిమా చాలా ఇబ్బందుల్లోకి వెళ్లిందని కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.