దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా స్టార్ హీరోయిన్..?

తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వ్యక్తి కొరటాల శివ.. కానీ ఈయన స్పీడ్ కి ఆచార్య సినిమాతో బ్రేక్ పడింది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆశించిన మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కొరటాల శివ ఎలాగైనా సక్సెస్ బాట పట్టాలని కసిగా జూనియర్ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో అప్డేట్ రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో దేవర ను ఒక ట్రెండ్ గా కొనసాగిస్తున్నారు.

Devara Release Date, Star Cast, Trailer, Budget, Makers, Plot, Box Office,  Reviews & More - JanBharat Times

దేవర సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.. రెండో హీరోయిన్ కూడ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ కూడా రాబోతోందని సమాచారం. అయితే ఈ క్రమంలోనే సినిమాలో ఓ కీలకమైన క్యారెక్టర్ కి సంబంధించిన విషయం బయటకు రావడం జరుగుతోంది.

అయితే దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు అత్త పాత్ర కోసం తెలుగు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అని సెలెక్ట్ చేశారట కొరటాల శివ.అయితే ఆల్రెడీ రమ్యకృష్ణ తో ఎన్టీఆర్ కలిసి నా అల్లుడు సినిమా చేశారు. అప్పట్లో వీరి కాంబినేషన్ బాగానే సక్సెస్ అయ్యింది. దేవర సినిమాలో కూడా అత్తగా రమ్యకృష్ణ నటిస్తారని గట్టిగా వినిపిస్తోంది. జాన్వి కపూర్ అమ్మగా రమ్యకృష్ణ నటించబోతున్నట్టు సమాచారం.అంతేకాకుండా దేవర సినిమా ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం మరో మలుపు తిరగబోతుందని అది కూడా రమ్యకృష్ణ పాత్రతోనే అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా విడుదల కాబోతోంది.