శ్రీ‌లీల‌తో నంద‌మూరి మోక్షజ్ఞ ముచ్చట్లు.. ఏంటి సంగ‌తి గురూ..?

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు గ‌త కొన్నేళ్ల నుంచి క‌ళ్లల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఆ మధ్యన మోక్షజ్ఞ బాగా బొద్దుగా కనిపించడంతో నంద‌మూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. అస‌లు మోక్షజ్ఞకు హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచ‌న ఉందా.. లేదా.. అన్న అనుమానాలు కూడా త‌లెత్తాయి. అన్న‌టికీ చెక్ పెడుతూ మోక్షజ్ఞ స్లిమ్‌గా మ‌రియు హ్యాండ్స‌మ్ గా మారాడు.

వీడేం హీరో మెటీరియ‌ల్ రా బాబు అన్న‌వారి నోర్లు మూయించాడు. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్స్ చూశారా.. నంద‌మూరి ఫ్యాన్స్ లో ఆయ‌న ఎంట్రీపై బ‌ల‌మైన న‌మ్మ‌కం కుదిరింది. ఇక‌పోతే తాజాగా మోక్షజ్ఞ త‌న తండ్రి బాల‌కృష్ణ చేస్తున్న `భ‌గ‌వంత్ కేస‌రి` సెట్స్ లో సంద‌డి చేశాడు. అలాగే అక్క‌డే ఉన్న హీరోయిన్ శ్రీ‌లీల‌లో ముచ్చ‌ట్లు కూడా పెట్టేశాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో.. నంద‌మూరి అభిమానులు వాటిని చూసి తెగ మురిసిపోతున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి శ్రీలీలనే హీరోయిన్ గా సెట్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పిక్స్ లో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు.

కాగా, భ‌గవంత్ కేస‌రి విష‌యానికి వ‌స్తే.. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇందులో హీరోయిన్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంటే.. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. అక్టోబ‌ర్ 19న ఈ చిత్రం విడుద‌ల కానుంది.