బ్రేకింగ్ న్యూస్ : స్టార్ కమెడియన్ వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం..

ప్రముఖ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వడివేలు తమ్ముడు జగదీశ్వరణ్(55) ఇటీవల ఆదివారం (ఆగ‌ష్టు 27) కన్నుమూశాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జగదీశ్వరన్‌ కొద్దిరోజులుగా తమిళనాడు.. మధురైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు.

కిడ్ని పూర్తిగా డ్యామేజ్ కావ‌డంతో ఆరోగ్యం విషమించి చనిపోయాడు. కాగ‌ జగదీశ్వరన్ కూడా శింబు, కాదల్ అలైవిట్టలై సినిమాతో సహా పలు సినిమాల్లో నటుడుగా మెసించాడు. కానీ ఇండస్ట్రీలో ఆయనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో చెన్నై నుంచి మధురై వెళ్ళిన ఇతడు అక్కడ ఒక బట్టల షాప్ పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే కొద్ది నెలలు క్రితం వడివేలు తల్లి మరణించారు. ఆ విషాదం నుంచి కోలుకోక‌ముందే తమ్ముడు కూడా మరణించడంతో ఆయన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.