చీర‌లో అనుప‌మ టెంప్టింగ్ షో.. కేర‌ళ కుట్టిని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండ‌రు!

స్కిన్ షోకు దూరంగా ఉండే హీరోయిన్ల లిస్ట్ లో కేర‌ళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఒక‌టి. కానీ, ఇది ఒక‌ప్పుడు. ఇప్పుడు కాదు. గ‌త ఏడాది కార్తికేయ 2, బ‌ట‌ర్ ఫ్లై, 18 పేజెస్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అనుప‌మ‌.. ఈ మ‌ధ్య పూర్తిగా మారిపోయింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయింది. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో ఇటు అభిమానుల‌ను, ఇటు నెటిజ‌న్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

తాజాగా మ‌రోసారి అందాల‌తో అరాచ‌కం సృష్టించింది. మునుపెప్పుడూ క‌నిపించ‌నంత హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. చీర‌లో అస‌లైన అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసింది. కుర్రాళ్ల గుండెల్లో కాక‌రేపేలా ఫోటోల‌కు పోజులిచ్చింది. అనుప‌మ తాజా ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసి నిజంగా ఈమె అనుప‌మాయేనా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు హాట్‌, ఫైర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అందులో టిల్లు స్క్వేర్ ఒక‌టి. డీజే టిల్లుకు సీక్వెల్ ఇది. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తున్నాడు. అలాగే మ‌రోవైపు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో అనుప‌మ `ఈగ‌ల్‌` అనే సినిమా చేస్తోంది. ఇక త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ అనుప‌మ ప‌లు ప్రాజెక్ట్స్ ను టేక‌ప్ చేసింది.