వ‌న్ మినిట్‌లో మీ గ్యాస్ బ‌ర్న‌ర్ ఈజీగా క్లీన్ చేసుకోండిలా.. సూప‌ర్ ట్రిక్‌..!

వంటింట్లో ఎక్కువగా వస్తువులు జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ బర్నర్స్ మురికి, జిడ్డు పట్టి నల్లగా మారిపోతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేయడం కాస్త కష్టమైన పనే. అయినా ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అయితే చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.

ఒక కప్పులో బర్నర్స్ వేసి మునిగే దాకా వెనిగర్ పొయ్యాలి. దీనిలో అర స్పూన్ బేకింగ్ సోడా వేసి రాత్రంతా అలా ఉంచేసి మరుసటి రోజు ఉదయం బర్నర్స్ ని బ్రష్ సాయంతో శుభ్రం చేస్తే మురికి అంతా తొలగిపోయి.. కొత్త వాటిలా మెరుస్తాయి. ఇలా 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే సరిపోతుంది.

ఈనో ఉపయోగించి కూడా గ్యాస్ బర్నర్స్ ను శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ రసం, ఒక ఈనో పాకెట్ లో పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్స్ వేసి అరగంట తర్వాత శుభ్రం చేస్తే నల్లగా మారిన గ్యాస్ బర్నర్స్ తెల్లగా మెరుస్తాయి.