చావు బ్ర‌తుకుల్లో పూజా హెగ్డే.. అందుకే సినిమాల నుంచి తప్పుకుంటుందా..!

ఏంటి పూజా హెగ్డే చావు బతుకుల్లో ఉందా.. అసలు పూజ హెగ్డే కి ఏం జరిగింది..? ఎందుకు చావు బతుకుల్లో ఉందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. ఇక మరి పూజా హెగ్డే గురించి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆ సినిమాలు వల్ల పూజా హెగ్డే కి ప్రాణహాని ఉందని అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారాయి.

మరి ఇంతకీ పూజా హెగ్డే కి ప్రాణహాని ఉండడం ఏంటి.. అని మీరందరూ అనుకుంటున్నారా.. అయితే అసలు విషయం ఏమిటో ఇక్కడ చూద్దాం. నాగ చైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చింది పూజ. తొలి సినిమా ప్లాప్‌ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ముకుంద సినిమా కూడా ఈమెకు అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి మొహెంజో దారో సినిమాలు నటించింది. ఇది కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

అలాంటి టైంలో పూజ హెగ్డే కి అల్లు అర్జున్ కు జంటగా దువ్వాడ జగన్నాథం సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఆ తర్వాత పూజ అలా వైకుంఠపురం, మహర్షి, అరవింద సమేత వీర రాఘవ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. వరుస విజయాలతో పూజా హెగ్డే టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కానీ ఏం లాభం ఆ తర్వాత వచ్చిన మూడు నాలుగు సినిమాలు వరుస ప్లాప్ అవ్వడంతో ఈ హీరోయిన్ రేంజ్ మరింత పాతాళానికి పడిపోయింది.

అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం వంటి సినిమాల్లో పూజా హెగ్డే కి హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ ఆ రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పూజా హెగ్డే తాజాగా ఆ సినిమాలు నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక‌ పూజ హెగ్డే టీం కూడా అందుకు క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ పూజ హెగ్డే సినిమాల నుంచి తప్పుకోవడానికే ప్రధాన కారణం ఆమె ఆరోగ్యం బాగాలేదటట. గత సినిమాల్లో ఆమె నటించిన సమయంలో డాన్స్ చేసే సమయంలో తన కాళ్ళకి తీవ్రమైన గాయాలయ్యాయట.

దాంతో కొద్దిరోజులుగా పూజ ఆ గాయాలతో బాధపడుతుంది. అంతేకాకుండా తన కాళ్ళకి మేజర్ సర్జరీ కూడా చేయించుకుందట. ఇక ఈ కారణంతోనే పూజ తన కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తను పూర్తి ఆరోగ్యంగా మారాకే మరిన్ని సినిమాలకు సైన్ చేస్తుందని ఇండస్ట్రీలో ఉండే పూజ హెగ్డే సన్నిహితులు చెబుతున్నారు. అందుకే పూజా హెగ్డే వరుస‌గా సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది.