ఆ కోలీవుడ్ హీరోకు రక్షణ శాఖ కీలక బాధ్యత.. ఏంటంటే…

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు. తమిళ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమా లో నటించి స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్ స్టైలే వేరు. పర్సనల్గా ఫోన్ ఉపయోగించని ఏకైక హీరో ఎవరంటే అజిత్ అనే చెప్పాలి. ఇప్పటి జనరేషన్ లో కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. కనీసం అతనికి అభిమాన సంఘాలు కూడా ఏమీ లేవు. స్వయంగా అజితే అవేమీ వద్దని రద్దు చేశాడు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో సినిమా విడుదల కాకముందే ఫ్యాన్స్ హంగామా మొదలవుతుంది. అలాంటిది అజిత్ మాత్రం అవేమి వద్దు అని అధికారిక ఫ్యాన్స్ సంఘాలను రద్దు చేసేసాడు .

అజిత్ పుట్టింది హైదరాబాదులోనే. అతని తండ్రి తమిళ బ్రాహ్మిణ్, తల్లి సింధీ. అజిత్ చదివింది పదవ తరగతి అయినప్పటికీ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతాడు. అతని సినిమాలకు అతనే డబ్బింగ్ చెప్పుకుంటాడు. హీరోయిజం చూపించని మంచి వ్యక్తి. ఇండస్ట్రీ కి రాకముందు అజిత్ ఒక వెహికల్ మెకానిక్. ఆ తర్వాత డ్రైవర్ గా చేశాడు. అతను ఒక రేస్ కార్ల పోటీదారుడు. ఎన్నో జాతీయ కార్ల రేస్ లో అజిత్ పార్టిసిపేట్ చేశాడు. అంతేకాకుండా ఏరోస్పేస్ కు సంబందించిన కోర్సులు కూడా చేసాడు. అలానే ఫైటర్ జెట్ నడపడానికో ట్రైనింగ్ తీసుకొని ఫైలట్ గా లైసెన్సు కూడా తీసుకున్నాడు అజిత్. అజిత్ రకరకాల విభాగాల్లో తన సత్తా చాటుకున్నాడు. ఇక అజిత్ ఇండస్ట్రీ లోనే కాకుండా వ్యాపార పరంగా కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు.

అతని ఆధ్వర్యంలో దక్ష అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ డ్రోన్ల తయారీకి పెట్టింది పేరు. డ్రోన్స్ తయారీ కోసం అజిత్ తయారుచేసిన గ్రూప్ సభ్యులతో కలిసి తక్కువ సమయం లో ఎక్కువ బరువును తీసుకెళ్లే డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్సు లను తయారు చేసాడు. ఆస్ట్రెలియా లో నిర్వహించిన పోటీలో ఈ డ్రోన్స్ పని తీరుకి 2 nd ప్లేస్ లో నిలిచాయి. ఈ డ్రోన్స్ కాకులు దూరని కారడివి లో కూడా అద్భుతంగా సేవలు అందించగలవు. బ్లడ్, మెడిసిన్ అందించిన ఆ డ్రోన్ కు 2019 లో భారత డ్రోన్ ఓలంపిక్స్ ఫస్ట్ ప్రైస్ వచ్చింది. ప్రస్తుతం ఆ సంస్థకు భారత రక్షణ శాఖ నుండి ఒక కాంట్రాక్టు దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే ‘ మన సైన్యానికి అవసరమైన డ్రోన్లు తయారీ చెయ్యమని ‘ దిశ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చింది. దాదాపు 200 డ్రోన్లు, 170  కోట్ల ప్రాజెక్ట్ ఇది.  అడ్రోన్లను పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం ఉపయోగిస్తారు. అలానే విపత్తు సమయంలో ఎదుటి వారికి సహాయం చేయడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి. చెన్నై ఐఐటి విద్యార్థులు కొంతమంది అజిత్ నేతృత్వంలో ఒక టీమ్ గా ఏర్పడి ఈ కాంట్రాక్ట్ కోసం పని చేస్తున్నారు.