20 ఏళ్ల కెరియర్లు 41 సినిమాలు.. ఒకటే హిట్ మూవి.. ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో వరస్ట్ హిస్ట‌రి సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్‌ ఎవరో తెలుసా.ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎప్పటికప్పుడు హిట్ సినిమాలు చేస్తూ.. నటనలో వైవిధ్యం ప్రదర్శించాలి. కాని బాలీవుడ్‌కి చెందిన ఓ సీనియర్ హీరోయిన్‌ నేహాదూపియా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమై సుమారు రెండు దశాబ్ధాలు గడిచిపోయింది. ఇన్నేళ్ల కెరీర్‌లో 41సినిమాల్లో నటిస్తే ..ఒకే ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. మరో రెండు సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. ఆమె సినిమా కెరీర్‌లో అప్‌ అండ్ డౌన్స్‌ ఏంటో తెలుసుకుందాం.

బాలీవుడ్ నటి నేహా ధూపియా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి బాగా ట్రై చేసింది. ఎంత ప్రయత్నించినా ఆమెతో పాటు కెరీర్‌ బిగిన్ చేసిన నటీమణులతో పోటీ పడలేకపోయింది. వాళ్లకు వచ్చిన గుర్తింపులో కనీసం 20శాతం కూడా తెచ్చుకోలేకపోయింది. నేహా ధూపియా 20ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో 3సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఒక సినిమా సూపర్ హిట్ అయింది. నేహా ధూపియా 2003లో ‘ఖయామత్’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నేహా కథానాయికగా నటించినా ‘ఖయామత్’ మాత్రం వసూళ్ల పరంగా ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.ఆ మూవీ తర్వాత నేహా ధూపియా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. 2004లో విడుదలైన ‘జూలీ’ సినిమాలో నేహా ధూపియా అన్ని హద్దులు దాటేసింది. సినిమాలో చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. దాంతో సినిమా సెమీ హిట్ అయ్యింది.2005 సంవత్సరంలో నేహా ధూపియా ‘క్యా కూల్ హై హమ్’ సినిమాలో యాక్ట్ చేసింది. ఇందులో ఆమె రితేష్ దేశ్‌ముఖ్, తుషార్ కపూర్, ఇషా కొప్పికర్‌లతో స్క్రీన్‌ను పంచుకుంది. ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది.

కానీ ఆ తర్వాత నేహా కెరీర్ ఎవరికి గుర్తు లేదు. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.చివరికి తెలుగులో కూడా హీరో రాజశేఖర్ విలన్ సినిమాలో నేహాదూపియా హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడటంతో ..సౌత్‌లో కూడా అవకాశాలు దక్కలేదు. దాంతో పర్మినెంట్‌గా బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది.20 ఏళ్ల నేహా ధూపియా కెరీర్‌లో నేహా ధూపియా ‘క్యా కూల్ హై హమ్, గరం మసాలా , హిందీ మీడియం మూడు సినిమాలు మాత్రమే హిట్‌ అయ్యాయి. మిగిలిన 37సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.త‌ర్వాత‌ నేహా ధూపియా క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేసింది. సినిమాల్లో కెరీర్ పరంగా చూస్తే సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేహాదూపియా కంటే బ్యాడ్ లక్ హీరోయిన్ మరొకరు లేరనే చెప్పాలి.