నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ అల్లు అర్జున్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖ‌రీదైన గిఫ్ట్‌.. ఇంత‌కీ అదేంటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా `పుష్ప‌` సినిమాతో బెస్ట్ యాక్ట‌ర్ గా నేష‌న‌ల్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించ‌డంతో.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముకులు, అభిమానుల‌, సినీ ప్రియులు సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న‌కు విషెస్ తెలిపారు. కొంద‌రు అల్లు అర్జున్ ను ప్ర‌త్యేకంగా క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.

ఇంకొంద‌రు గిఫ్ట్స్ తో స‌ర్‌ప్రైజ్ చేస్తూ అల్లు అర్జున్ ను విష్ చేస్తున్నారు. చిరంజీవి మేన‌ల్లుడి చేత కేక్ క‌ట్ చేయించారు. ఇటు మెగా, అటు అల్లు ఫ్యామిలీస్ పుష్ప‌రాజ్ సాధించిన ఘ‌న‌ట ప‌ట్ల ఫుల్ గా హ్యాపీగా ఉన్నారు. మెగా కోడుల ఉపాస‌న అల్లు అర్జున్ కు స్పెష‌ల్ గిఫ్ట్ పంపింది. ఇక తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ కు ఓ ఖ‌రీదైన గిఫ్ట్ ను సెండ్ చేశాడ‌ట‌.

అల్లు అర్జున్ రూపాన్ని ప్ర‌త్యేకంగా హ్యాండ్ వ‌ర్క్ తో చేసిన ఒక ఆర్ట్ ను బ‌హుబ‌తిగా పంపాడ‌ట‌. అది చూసి అల్లు అర్జున్ తెగ మురిసిపోయాడ‌ట‌. ప‌వ‌ర్ స్టార్ ఇచ్చిన గిఫ్ట్ ఆయ‌న‌కు తెగ న‌చ్చేసింద‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇంత వ‌ర‌కు అల్లు అర్జున్ చిన్న మావ‌య్య ఇచ్చిన గిఫ్ట్ గురించి పోస్ట్ గానీ, స్టోరీ గానీ పెట్ట‌లేదు.