లెజెండ్రీ నటుడు దాసరి బయోపిక్ రాకపోవడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు దాసరి నారాయణరావు. ఈయన మరణాంతరం ఈయన జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. అందుకోసం అతని శిష్యులు కథని సిద్ధం చేస్తున్నారని ఒక టాప్ డైరెక్టర్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఈ కథనాలకు బ్రేక్ పడుతూ రావడం జరిగింది.

Telugu director Dasari Narayana Rao dead, he was 75 | Telugu News - The  Indian Express

ఇలాంటి సాహసం ఎవరు చేయలేరని కూడా దాసరి సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దాసరి ఆస్తుల విషయంలో కుటుంబంలో విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో దాసరి బయోపిక్ పూర్తిగా మరిచిపోయారు. ప్రస్తుతం దాసరి ప్రియ శిష్యులు అంతా కూడా తామ వృత్తి పనులలో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దాసరి శిష్యులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నట్లు సమాచారం. అన్ని విభాగాలలో అన్ని శాఖలలో కూడా దాసరికి మంచిపట్టు ఉంది ఆయన శిష్యులు కూడా చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది.

Dasari Narayana Rao: Veteran Telugu filmmaker Dasari Narayana Rao dies at 75

దాసరి నారాయణ ప్రియ శిష్యుడు అప్పట్లో ఈ సినిమా కథని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మిగతా వారెవరు కూడా ఈ దాసరి కథ పైన ఆసక్తి చూపించలేదు…ఆయన కథ రాయడానికి తమ అనుభవం సరిపోదని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దాసరి పైన ఇప్పటికి కొన్ని పుస్తకాలు అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Dasari Narayana Rao Family Photos

దాసరి మరణం తర్వాత ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన జీవిత చరిత్ర అని పుస్తకంలో పొందుపరిచారు. దాసరి గారు ఒక లెజెండ్రీ నటుడు సినిమాలలోకి ఆయన వచ్చిన విధానం ఎదిగిన విధానం ఆ తరువాత సినీ పరిశ్రమలో పెద్దగా ఆయన బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్క అంశం కూడా చూపించాల్సి ఉంటుంది.తన జీవితంలో పలు రకరకాల కోణాలలో విశ్లేషించాల్సి ఉంటుంది.వీటన్నిటిని సినిమాగా తీయాలి అంటే కేవలం త్రివిక్రమ్ వంటి వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుందట. కథ రాయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాని తెరకెక్కించడమే మరొక సవాల్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.