మంచు మనోజ్ డేరింగ్ స్టెప్.. టచ్ చేయకూడని మ్యాటర్ ని కెలుకుతున్నావ్ ‘బ్రో’..!!

సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఊహించినవన్నీ తెరపైన మనం చూస్తూనే ఉన్నాం . ఇలాంటి క్రమంలోనే మంచు వారి చిన్న అబ్బాయి మనోజ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే భూమ మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ సోషల్ మీడియాలో మరోవైపు సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారిపోతున్నారు . రీసెంట్ గానే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అఫీషియల్ గా కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్న మంచు మనోజ్ భూమా మౌనిక త్వరలోనే టిడిపిలో మరో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

అంతే కాదు 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచు మనోజ్ కూడా పోటీ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు మంచు మనోజ్ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన చేయలేదు . కానీ ఇలాంటి క్రమంలోనే సరికొత్త టాక్ షో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . గతంలో మంచు మనోజ్ వాళ్ళ అక్క మంచు లక్ష్మి ఓ టాక్ షో కు ఓస్టుగా చేసిన విషయం తెలిసిందే. కాగా మళ్లీ ఇన్నాళ్లకు మంచు ఫ్యామిలీ నుంచి మంచు ఫ్యామిలీ నుంచి హోపోస్ట్ చేయడానికి మరో వ్యక్తి రంగంలో దిగాడు .

అయితే ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ వచ్చే టాక్ షో కాదు అని ..పలువురు బడా రాజకీయ నేతలు కూడా ఈ షోలోకి ఇన్వైట్ చేసి ప్రెసెంట్ పొలిటికల్ పవర్ ఎలా ఉంది ..? ఎలాంటి రాజకీయ నేత వస్తే జనాలకు బాగు జరుగుతుంది..? అనే విషయాలపై చర్చించే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ షో గా ఉండబోతుందట. ఆశ్చర్యం ఏంటంటే మంచు మనోజ్ హోస్టుగా చేసే టాక్ షోని డిజైన్ చేస్తుంది ప్రొడ్యూస్ చేస్తుంది పవన్ కళ్యాణ్ బ్రో చిత్ర నిర్మాతలు కావడం విశేషం. ఇది ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కాబోతుందట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అనే విధంగా ఒకే ఒక్క టాక్ షో తో అటు సినిమా ఇండస్ట్రీని ఇటు రాజకీయాలల్లో చక్రం తిప్పబోతున్నాడు మంచు మనోజ్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!