పంది మాంసం నా ఫేవరెట్ ఫుడ్ అంటున్న రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం తమిళ్, తెలుగు, బాలీవుడ్ వంటి భాషలలో తన హవా కొనసాగిస్తూ ఉన్నది. రష్మిక సోషల్ మీడియాలో కూడా తరచూ యా క్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రకాల ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటుంది

Rashmika Mandanna Misses Home-Style Cuisine And Wine Culture Of Coorg

ఇక రష్మిక తన పర్సనల్ విషయాలను కూడా అప్పుడప్పుడు తెలియజేస్తూ అభిమానులకు షాకిస్తూ ఉంటుంది. కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందిన రష్మిక ఆహార విషయంలో తనకి పంది మాంసం అంటే చాలా ఇష్టమట. ఆ సామాజిక వర్గ ప్రజలు సాంప్రదాయ వంట కూడా ఇదేనంటూ తెలియజేసింది. పంది మాంసం నిప్పుల పైన కాల్చుకొని తింటే చాలా రుచిగా ఉంటుందని కూడా తెలియజేసింది రష్మిక అలాగే వారు ఇంటిలోనైనా వైన్ తయారు చేసుకుంటారట.. ఆహారం తర్వాత రెండు గ్లాసులు వైన్ తాగి పడుకుంటే సుఖంగా నిద్ర పడుతుందని రష్మిక గతంలో తెలియజేసినట్లు తెలుస్తోంది.

Rashmika Mandanna | Kodagu First

రష్మిక గతంలో తెలియజేసిన తన ఆహారపు విషయంపై ఈ అలవాటు విన్న అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రష్మిక కూడా ఇలాంటివి చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా కూడా బాండ్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది.. బాలీవుడ్ లో యానిమల్ అనే ఒక చిత్రంలో నటిస్తోంది. కన్నడలో కూడా ఒక చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.