“క్రేజ్ ఉంటే లవర్.. లేకపోతే బ్రదరా”..? తమన్నా సీక్రేట్ ని బయటపెట్టిన తెలుగు హీరో..

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ లెక్కలు పూర్తిగా మార్చేస్తున్నారు . క్రేజ్ ఉంటే ఎలాంటి హీరోతోనైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా అదే లిస్టులోకి తాజాగా ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రెసెంట్ టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది తమన్నా. రీసెంట్ గా బాలీవుడ్ లో ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చూస్తే ఆమెకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అయిపోతుంది.

ప్రజెంట్ తమన్నా తెలుగులో “భోళాశంకర్” అనే సినిమాలో నటించింది . కోలీవుడ్లో “జైలర్” అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలోనే థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. కాగా ఇదే క్రమంలో భోళాశంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ తమన్నా పై క్రేజీ కామెంట్స్ చేశారు . హీరో సుశాంత్ మాట్లాడుతూ ..”నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది తమన్నా తోనే ..కాళిదాసు సినిమాలో ఆమె నా లవర్ ..ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో ఆమె నా చెల్లి” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు.

దీనితో ఒక్కసారిగా అక్కడ ఉండే వాళ్ళు పక్కపక్క నవ్వేశారు . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో సినిమాలో నటించడం నా డ్రీమ్. నా కోరిక నెరవేరింది. ఇక నాకేం కావాలి అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు . అయితే తమన్నా పై సుశాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుశాంత్ చెప్పింది నిజమే అని ..అదే సుశాంత్ కి క్రేజ్ ఉండి ఉంటే ఏ స్టార్ హీరోనో అయి ఉంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకునేదే కాదని ..సుశాంత్ క్రేజ్ లేని హీరో కాబట్టి ఆమె తన బ్రదర్ గా ఒప్పుకొని మరి సినిమాలో నటిస్తుంది అని చెప్పుకొస్తున్నారు.