బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ అనన్య పాండే. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది. ఇప్పటికి ఈ సినిమా పైన ఇప్పటికీ వివాదం తలెత్తుతూ ఉంటుంది. లైగర్ సినిమా తరువాత మరో సినిమాలో కూడా ఈ అమ్మడు కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో కుర్రకారులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మోడరన్ దుస్తులలో మెరుస్తూ ఉన్న అనన్య తాజాగా బికినీ ఫోటోలతో మరింత అందంగా మెరిసిపోతోంది. పింకీ కలర్ బికినీలో తన అందాలను ప్రదర్శించి ఏదో వెకేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన చుట్టూ ఉన్న లొకేషన్ ని బట్టి మరింత అందంగా కనిపిస్తోంది అనన్య పాండే. ఈ అమ్మడు బికినీ ఫోటోలు టు హాట్ గా కనిపిస్తున్నాయి.
అనన్య పాండే ఈ మధ్యకాలంలో సినిమాలతో సంబంధం లేకుండా ఒక విషయంలో వైరల్ గా మారుతోంది ..ప్రేమ వ్యవహారం వల్ల మరింత వైరల్ గా మారుతోంది.. మొదట హీరో టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి.
కానీ ఇప్పుడు తాజాగా ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్నప్పుడు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. స్పెయిన్ లో ట్రిప్పుకు వెళ్ళగా అక్కడ కొన్ని ఫోటోలు లీక్ అయినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా పోర్చుగల్ రాజధాని లిస్బ్ న్ లో వీరిద్దరూ కలిసి కనిపించారు. అయితే వీరిద్దరి మధ్య 13 ఏళ్ల వయసు తేడా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram