‘సామజవరగమన’ మూవీ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. న‌య‌న‌తార‌తో ఆమెకు సంబంధం ఏంటి?

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో `సామజవరగమన` ఒక‌టి. శ్రీ‌విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీ ద్వారా రెబా మోనికా జాన్ అనే కొత్త హీరోయిన్ టాలీవుడ్ కు పరిచ‌యం అయింది.

తొలి సినిమాతోనే రెబా అంద‌రి మ‌న‌సులు దోచేసింది. అయితే రెబా ఎవ‌రు..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అన్న‌ది ఎవరికీ పెద్దగా తెలియ‌దు. బెంగుళూరులోని మలయాళీ కుటుంబంలో రెబా మోనికా జ‌న్మించింది. మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన రెబా.. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అనేక ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించింది.

2016లో `జాకోబింటే స్వర్గరాజ్యం` అనే మ‌ల‌యాళ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంతో పాటు త‌మిళ సినిమాల్లోనూ వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. విజయ్ ద‌ళ‌ప‌తి, న‌య‌న‌తార కాంబోలో వ‌చ్చిన‌ సూపర్ హిట్ చిత్రం ‘విజిల్’ లో యాసిడ్ బాధితురాలిగా నటించిన అమ్మాయి మరెవరో కాదు రెబానే. ఈ సినిమా స‌మ‌యంలోనే రెబా, న‌య‌న‌తార బాగా క్లోజ్ అయ్యారు.

న‌య‌న‌తార-విఘ్నేష్ శివ‌న్ పెళ్లిలో కూడా రెబా హాజ‌రు అయింది. అన్న‌ట్లు మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. రెబా మోనికాకు వివాహం అయింది. 2022లో ప్రియుడు జోమోన్ జోసెఫ్‌ను ఈమె వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం అటు మ్యారేజ్ లైఫ్ తో పాటు ఇటు ఫిల్మ్ కెరీర్ ను కూడా స‌క్సెస్ ఫుల్ గా కొన‌సాగిస్తోంది.