హాలీవుడ్ లో అదే పెద్ద స‌మ‌స్య‌.. వారం రోజులు న‌ర‌కం చూశానంటూ అలియా భ‌ట్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ కిడ్ అయిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్ తోనే స్టార్డ‌మ్ ద‌క్కించుకుంది. ఎలాంటి పాత్ర‌లో అయినా ప‌రాక‌య ప్ర‌వేశం చేసి న‌టించ‌డం అలియా నైజాం. `ఆర్ఆర్ఆర్` మూవీతో ఈ బ్యూటీ సౌత్ ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ద‌గ్గ‌రైంది. త్వ‌ర‌లోనే అలియా భ‌ట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

అక్క‌డ ఈమె డెబ్యూ మూవీ విడుద‌ల కాబోతోంది. అదే `హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌`. ఆగ‌స్టు 11న ఈ మూవీ నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అలియా భ‌ట్‌.. హాలీవుడ్ లో తాను ఫేస్ చేసిన స‌మ‌స్య గురించి బ‌య‌ట పెడితే షాకింగ్ కామెంట్స్ చేసింది. `హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ షూటింగ్‌లో అమెరికా ఇంగ్లీష్‌ యాసను పలికించడం పెద్ద సవాలుగా అనిపించింది.

నాకు ఇంగ్లీష్‌పై మంచి పట్టుంది. నేను ఎక్కువ‌గా ఇంగ్లీష్ నే మాట్లాడ‌తా. కానీ, హాలీవుడ్‌ సినిమాలో నటించడం తొలిసారి కాబట్టి ఆ యాసలో డైలాగ్స్‌ చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. వారం రోజు న‌ర‌కం చూశాను. బాగా ప్రాక్టీస్ చేశారు. ఆ త‌ర్వాత ఆ యాసపై పట్టు దొరికింది.` అంటూ అలియా భ‌ట్ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇక త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతున్న హార్ట్‌ ఆఫ్‌ స్టోన్ మంచి విజ‌యం సాధిస్తే.. అలియా భ‌ట్ హాలీవుడ్ లో మ‌రింత బిజీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.