“నువ్వు అదేనా..?”..ఓ మగాడిని అడగకూడని ప్రశ్న అడిగేసారు కదా రా నాయన..!!

బిగ్ బాస్ ద్వార పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు . బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్ స్టార్ అవుతారు అంటే కాదని చెప్పాలి. కొందరు కంటెస్టెంట్లు జీరో కూడా అవుతూ ఉంటారు. కొన్నిసార్లు మన టైం బాగో లేకపోతే మనం చేసిన పనులు కారణంగానో ..కొన్ని కొన్ని సార్లు మన స్ట్రాటజీ వర్కౌట్ అవ్వని కారణంగా బిస్కెట్ అయిపోతూ ఉంటాము . ఆ లిస్టులోకే వస్తాడు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురి అవుతున్న అఖిల్ .

అంతకుముందు ఈ పేరుకి పెద్దగా పాపులారిటి లేదు. ఏదో అడపా దడపా సీరియల్స్ లో చేశాడు . కానీ పెద్ద స్టార్ అని చెప్పలేం. అయితే బిగ్బాస్ హౌస్ లోకి వెళ్ళాక తనదైన స్టైల్ లో గేమ్ ఆడి ..తోటి కంటెస్టెంట్ మేణాల్ తో నడిపిన ప్రేమ యవ్వారాలు.. హాట్ రొమాన్స్ అప్పట్లో హైలైట్ గా మారింది . బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అఖిల్ పై నెగెటివిటీ పెరిగిపోయింది . అయితే ఆ తర్వాత ఎలాగోలా మళ్ళీ బుల్లితెర పై కనిపించడానికి ట్రై చేశారు .

రీసెంట్ గానే ఓ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసి పర్లేదు అని అనిపించుకున్నాడు . కాగా మొన్న ఆ మధ్య నటి తేజస్విని మదివాడ తో ఎంత హాట్ రొమాన్స్ చేశారో మనం మర్చిపోగలమా..? ఈ జంట రొమాన్స్ చూస్తే ఎవరైనా సరే వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ కాదు మరేదో ఉంది అని అనుకుంటారు . అయితే ఈ సందర్భంగానే సోషల్ మీడియాలో ఓ లైవ్ చిట్ చాట్ లో పాల్గొన్న అఖిల్ కు నెటిజన్ల నుంచి కొన్ని వింత ప్రశ్నలు ఎదురయ్యాయి .

మీరు “వర్జినా..?” అంటూ అడిగేసాడు . ఈ ప్రశ్నకు అఖిల్ జేమ్స్ బాండ్ టైటిల్ వీడియో పెట్టాడు . అయితే అసలు ఆయన వర్జినో ..? కాదో ..? స్పష్టంగా మాత్రం చెప్పలేకపోయాడు. ” మృణాల్- తేజస్వినిలో మీకు ఎవరు కావాలి..?” అంటూ మరో నెటిజన్ స్ట్రైట్ గా అడిగేశాదు. ” ఇద్దరు కాదు నేహా శెట్టి కావాలి” అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ చాట్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి..!!