శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు.. మోగా హీరోను న‌మ్మితే ఇలా హ్యాండిచ్చాడేంటి..?

టాలీవుడ్ లో యంగ్ సెన్సేష‌న్ గా మారిన అందాల భామ శ్రీ‌లీల ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ్రీ‌లీల చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో దాదాపు అర డ‌జ‌న్ చిత్రాలు వ‌చ్చే ఆరు నెలల్లో విడుద‌ల కాబోతున్నాయి. ఈ నెల‌లోనూ మెగా హీరో మూవీతో శ్రీ‌లీల ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాల్సి ఉంది. కానీ, స‌ద‌రు హీరో ఆఖ‌రి నిమిషంలో హ్యాండిచ్చాడు. శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన చిత్రం `ఆది కేశ‌వ‌`. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి ఈ మూవీని తెర‌కెక్కించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్త నిర్మిస్తుండగా.. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాను ఆగ‌స్టు 18న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఆల్రెడీ ప్ర‌క‌టించారు.

పెళ్లి సంద‌డి, ధ‌మాకా హిట్స్ త‌ర్వాత ఆది కేశ‌వ‌తో శ్రీ‌లీల హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆశ‌ప‌డింది. కానీ, లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా విడుద‌ల‌ను ఏకంగా మూడు నెల‌లు వాయిదా వేశార‌ట‌. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పాటు ఆగ‌స్టు నెల‌లో చిరంజీవి భోళా శంక‌ర్‌, ర‌జ‌నీకాంత్ జైల‌ర్ వంటి పెద్ద సినిమాలు విడుద‌ల‌కు రెడీ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే రిస్క్ ఎందుక‌ని భావించి వైష్ణ‌వ్ తేజ్ వెన‌క్కి త‌గ్గాడ‌ట‌.నవంబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌లీల కొంచెం ఫీల్ అయింద‌ని టాక్‌.