మైనంపల్లి ప్లేస్ లో మల్లారెడ్డి అల్లుడు?

రాజకీయ నేతలకు దూకుడుగా ఉండాలి గాని..నోటికి పనిచెప్పే కార్యక్రమాలు చేయకూడదనే చెప్పాలి. ప్రత్యర్ధులపై విరుచుకుపడితే అదొక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత పార్టీలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటే చెల్లుబాటు అయినట్లు..ప్రాంతీయ పార్టీల్లో అవ్వదు. అనవసరంగా చిక్కుల్లో పడటమే. ఇప్పుడు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్తితి కూడా అలాగే ఉంది.

మైనంపల్లి తనతో పాటు తన వారసుడుకు మెదక్ అసెంబ్లీ అడుగుతున్న విషయం తెలిసిందే. అయితే తన వారసుడుకు సీటు రాకుండా హరీష్ రావు అడ్డుకుంటున్నారని, అసలు ఆయనకు మెదక్ లో పని ఏంటి? అని…మెదక్ అసెంబ్లీని ఓ కీప్ మాదిరిగా చూస్తున్నారని, ఆయన మెదక్ లో వేలుపెడితే..తాను సిద్ధిపేటలో వేలు పెడతానని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇలా తిట్టిన తర్వాత..కే‌సి‌ఆర్ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించారు..ఆ లిస్ట్ లో మైనంపల్లికి మల్కాజిగిరి సీటు ఫిక్స్ చేశారు. కానీ ఆయన తనయుడుకు సీటు ఇవ్వలేదు.

మైనంపల్లి..హరీష్ పై చేసిన వ్యాఖ్యలని కే‌టి‌ఆర్, కవిత ఖండించారు. అటు కే‌సి‌ఆర్ ఈ విషయం తెలుసుకుని..అవసరమైతే ఉన్న సీటు పీకేస్తామని మాట్లాడారు. ఈ క్రమంలోనే మైనంపల్లి చర్యలు తీసుకోవడానికి బి‌ఆర్‌ఎస్ అధిష్టానం సిద్ధమైనట్లు తెలిసిండ్డి. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి..మల్కాజిగిరి సీటుని మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి లేదా..మరో నేతకు కేటాయించే ఛాన్స్ ఉందని తేలింది.

సీటు మైనంపల్లి సైతం బి‌ఆర్‌ఎస్‌ని వీడటానికే రెడీ అయినట్లు సమాచారం..ఆయనతో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నారు. మొత్తానికి మైనంపల్లి బి‌ఆర్‌ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళేలా ఉన్నారు. మరి కాంగ్రెస్ లో ఆయన రెండు సీట్లు దక్కుతాయో లేదో చూడాలి.