బాబు-పవన్ ఎటాక్..జగన్‌కు లాభమే.!

ఏపీలో ప్రతిపక్ష నేతలు జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ..జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడుతున్నారు. మొదట టి‌డి‌పి చంద్రబాబు..ప్రజల్లో తిరుగుతూ రోడ్ షోలు, సభలు అంటూ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక బాబు బ్రేక్ ఇవ్వగానే పవన్ వారాహి యాత్ర అని స్టార్ట్ చేశారు. ఆ యాత్రలో జగన్, వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇక పవన్ గ్యాప్ తీసుకోగానే బాబు ఎంట్రీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన పేరుతో..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వస్తున్నారు. అలాగే బహిరంగ సభలు పెడుతూ..ప్రజల్లోకి వెళుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో ఊహించని సన్నివేశం చోటు చేసుకుంది. శ్రీకాకుళంలో బాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ముగియగా, విశాఖలో పవన్ వారాహి మూడో విడత యాత్ర మొదలుపెట్టారు. అటు పాతపట్నంలో బాబు సభ నిర్వహించగా,  ఇటు విశాఖ నగరంలో పవన్ సభ నిర్వహించారు. ఇలా ఇద్దరు నేతలు ఒకేసారి జగన్ ప్రభుత్వంపై ఎటాక్ చేశారు.

ఆంధ్రా వీరప్పన్ జగన్ అంటూ పవన్ ఫైర్ అయ్యారు. వీరప్పన్..గిరిజనులని అడ్డం పెట్టుకుని గంధపు చెట్లని కొట్టించినట్లే..జగన్..వాలంటీర్లని అడ్డం పెట్టుకుని ప్రజల డేటా కొట్టేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం బాగుపడాలంటే సైకో పోవాలి..సైకిల్ రావాలి అని బాబు పిలుపునిచ్చారు. ఇలా ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు..జగన్ ప్రభుత్వంపై ఎటాక్ చేశారు. ఇక బాబు యాత్ర ముగియడంతో..ఇంకా పవన్ వారాహి యాత్ర కొనసాగనుంది.

అయితే ఇద్దరు నేతలు కలిసే పనిచేస్తున్నారని దీని బట్టి అర్ధమైపోతుంది. కానీ ఎవరెన్ని చేసిన ప్రజలు జగన్ వైపే ఉన్నారని, ప్రతిపక్ష నేతలు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్తితి లేదని వైసీపీ నేతలు అంటున్నారు. త్వరలోనే విశాఖకు జగన్ వెళ్తారని, రాజధాని ఏర్పాటు చేస్తారని, ఉత్తరాంధ్ర మద్ధతు వైసీపీకే ఉంటుందని చెప్పుకొస్తున్నారు.