ఆ విషయంలో నెంబర్ 1న్ బాల‌య్యే.. 2మహేష్ మిగిలిన హీరోలు సుద్ద పప్పులే..!

ఎస్ ఓ విష‌యంలో టాలీవుడ్‌లోనే నెంబ‌ర్ 1 హీరో బాల‌య్య‌.. ఆ ఒక్క విష‌యంలో మాత్రం ఆయ‌న‌కు తిరుగు ఉండ‌దు.. ఆయ‌న అంత మంచి మ‌నిషి ఎవ్వ‌రూ ఉండ‌రు. ఇప్పుడు సినిమా రంగంలో చాలా మార్పులు వ‌చ్చాయి. హీరోలు ఓ సారి క‌థ విని ఓకే చేశాక కూడా.. సెట్స్ మీద‌కు వెళ్లిన‌ప్పుడు చాలాసార్లు జోక్యం చేసుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్టు క‌థ‌ను అష్ట‌వంక‌ర‌లు తిప్పేస్తూ ఉంటారు. కొంద‌రు హీరోల ఒత్తిడితో ద‌ర్శ‌కులు రేపు షూట్ చేయాల్సిన సీన్‌ను కూడా మార్చేస్తూ ఉంటారు.

ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్‌లో అంద‌రు హీరోలు స్క్రిఫ్ట్ లాక్ అయ్యాక కూడా తెగ కెలికేస్తున్నారు. అయితే ఈ విష‌యంలో ఇద్ద‌రు హీరోలు మాత్ర‌మే ద‌ర్శ‌కుల హీరోలుగా మంచి మార్కులు వేయించుకున్నారు. ఓ సారి క‌థ విని ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పాక బాల‌య్య అస్స‌లు స్క్రిఫ్ట్‌లో ఏ మాత్రం జోక్యం చేసుకోడు. ఈ విష‌యం ఇండ‌స్ట్రీ మొత్తానికి తెలుసు. ద‌ర్శ‌కుడు ఏది చెపితే అది చేసుకుంటూ పోవ‌డ‌మే..!

సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా బాల‌య్య ద‌ర్శ‌కుల హీరో. ఈ విష‌యంలో ఆయ‌నే ఇండ‌స్ట్రీ నెంబ‌ర్ వ‌న్‌. ఆయ‌న‌కు సాటి వ‌చ్చే హీరో ఎవ్వ‌రూ లేరు. ఇక స్టార్ హీరోల్లో బాల‌య్య త‌ర్వాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కూడా ద‌ర్శ‌కుల హీరోగా పేరు ఉంది. స్క్రిఫ్ట్ విష‌యంలో సందేహాలు ఉంటే అడ‌గ‌డం మిన‌హా ఆయ‌న కూడా పెద్ద‌గా ద‌ర్శ‌కుల‌ను ఇబ్బంది పెట్ట‌రు.

ఇలా ఈ ఇద్దరు హీరోలు మినహా మిగిలిన హీరోలు అందరూ ఏదో ఒక సమయంలో తమ సినిమాల విషయంలో డైరెక్షన్లో జోక్యం చేసుకుని వరుస ప్లాప్‌లు అందుకున్నవారే. ప్రస్తుతం ఉన్న హీరోలలో ఒక బాలయ్య- మహేష్ బాబు మాత్రం దర్శకుడుతో కథ ఒకే అవగానే మరో మాట మాట్లాడకుండా తమ పని తాము చేసుకుంటూ దర్శకుడు ఏది చెప్తే అది చేస్తూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు.ఏదేమైనా ద‌ర్శ‌కుల హీరోగా పేరున్న వాళ్ల‌లో బాల‌య్యే నెంబ‌ర్ వ‌న్ హీరో.. త‌ర్వాత మ‌హేష్‌బాబు మాత్ర‌మే.