ఎట్టకేలకు హీరోయిన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన విశాల్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే తెలుగువారు అయినప్పటికీ కూడా తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విశాల్ మార్కెట్ పరంగా కూడా తెలుగులో బాగానే ఉంది. అయితే విశాల్ పెళ్లి పైన ఎప్పుడు పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Is Tamil actor Vishal getting married to Lakshmi Menon? | PINKVILLA

ఇక అంతే కాకుండా విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా అంటూ కూడా పలు రకాల రూమర్లు రావడంతో కోలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన లక్ష్మీ మీనన్ ను త్వరలోనే విశాల్ వివాహం చేసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో మరింత ఈ వార్తలకు బలం చేకూర్చింది.అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే విశాల్, లక్ష్మి మీనన్ కానీ ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

తాజాగా ఈ విషయం పైన నటుడు విశాల్ స్పందించినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తలలో నిజం లేదని కేవలం అవన్నీ ఒక రూమర్లే అన్నట్లుగా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి వార్తలు అసలు నమ్మవద్దని మీ అందరిని అభ్యర్థిస్తున్నాను.. ఇలాంటి పుకార్లకు వ్యాప్తి చేయడం మానుకోండి అంటూ విశాల్ అధికారిక ప్రకటనలో తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఏవైనా ఉంటే కచ్చితంగా నేనే స్వయంగా సోషల్ మీడియాలో తెలియచేస్తానని తెలిపారు.ప్రస్తుతం విశాల్ మార్క్ ఆందోని సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇప్పుడైనా ఈ విషయాలకు చెక్ చేపడుతుందేమో చూడాలి మరి.