అమలాపురం సీటుపై ట్విస్ట్..వైసీపీ-టీడీపీల్లో కన్ఫ్యూజన్.!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాజాగా సి‌ఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి బటన్ నోక్కారు. ఇదే సమయంలో కోనసీమలో రాజకీయంగా వైసీపీ పట్టు తగ్గకుండా ఉండేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా వెళుతున్నారు.

ఈ క్రమంలోనే అమలాపురం అసెంబ్లీలో మంత్రి పినిపే విశ్వరూప్ సీటు విషయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో విశ్వరూప్, తన తనయుడు సైతం పర్యటిస్తున్నారు. దీంతో జగన్ ఎవరైనా ఒక్కరే తిరగాలని సూచించారు. అయితే విశ్వరూప్ ఇటీవల అనారోగ్యంతో ఎక్కువ తిరగలేకపోతున్నారు. దీంతో ఆయన తనయుడు శ్రీకాంత్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా అమలాపురం వెళ్ళిన జగన్..” నువ్వు బాగా తిరుగు..లేదా నీ కొడుకు డాక్టర్ శ్రీకాంత్‌ను బాగా తిప్పు” అని విశ్వరూప్‌కు సూచించారు. దీంతో అమలాపురం సీటు విషయం విశ్వరూప్ చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.

ఎలాగో విశ్వరూప్‌కు వయసు మీద పడింది..దీంతో ఆయన తనయుడునే బరిలో దింపే ఛాన్స్ ఉంది. అటు టి‌డి‌పికి కూడా ఈ సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ జనసేనతో పొత్తు ఉంటే సీటు విషయంలో పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీకి 72 వేల ఓట్లు పడితే..టి‌డి‌పికి 46 వేలు, జనసేనకు 45 వేల ఓట్లు పడ్డాయి.

అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీని సులువుగా ఓడించవచ్చు. కానీ టి‌డి‌పి-జనసేన సమాన బలం ఉన్నాయి. అలాంటప్పుడు సీటు ఎవరికి దక్కుతుందనేది క్లారిటీ లేదు. ఒకవేళ పొత్తు లేకపోతే ఎవరికి వారు పోటీ చేయవచ్చు. పొత్తు ఉంటే సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.