బాల‌య్య బాబు ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకున్న ఆ సినిమాలు ఇవే…!

నందమూరి హీరో బాలయ్య బాబు గురించి అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే బాలయ్య కెరియర్ లో కూడా ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి..అవి ఎలాంటి సినిమాలు అంటే అభిమానులకే విసుగు తెప్పించేలా ఆ సినిమాలు ఉండడం జరిగింది.

Amazon.com: Seema Simham : Bala Krishna, Simran, Reema Sen, Paruchuri Brothers, G Ram Prasad, D.V.V. Danayya, Bhagawan J., J. Pulla Rao: Prime Video

బాలయ్య కెరియర్లు నరసింహనాయుడు సినిమా భారీ విజయం తరువాత.. ఆ తరువాత చిత్రం సీమ సింహం ఈ సినిమా కూడా ప్రేక్షకులలో మంచి ఏర్పడిందట. భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది. ఈ స్టోరీలో పెద్దగా దమ్ము లేకపోవడం వల్ల ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిందని సమాచారం. బాలయ్య కెరియర్ల మరొక డిజాస్టర్ సినిమా ఒక్కమగాడు.. ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

ఆ తరువాత పలనాటి బ్రహ్మనాయుడు, వీరభద్రుడు, మహారధి, పరమవీరచక్ర, తదితర చిత్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాలన్నీ కూడా అభిమానులకే విసుగు తెప్పించేలా కనిపించాడట. అయితే ఆ తర్వాత బాలయ్య కెరియర్ ని ఒక్కసారిగా సింహా సినిమాతో మార్చుకోవడం జరిగింది. సింహ సినిమా తర్వాత బాలయ్య బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఈ చిత్రం ఈ ఏడాది దసరాకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.