‘ ఖుషి ‘ మూవీలో నడుము సీన్ అంత హైలెట్ కావడానికి వెనుక ఉన్న రహస్యం అదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ ఖుషి ‘. 2001లో ఎస్‌.జే.సూర్య డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బీభత్సవం సృష్టించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – భూమిక నట‌న‌కి కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ – భూమికల మధ్యన గొడవలు, రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఖుషి సినిమా పేరు చెప్పగానే చాలామందికి మొదట గుర్తుకు వచ్చే సీన్‌ భూమిక నడుము సీన్. ఈ సినిమాలో భూమిక నడుము ఎంతగానో హైలైట్ అయింది. ఇదే సీన్‌ ఇటీవల రిలీజైన‌ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో సహా చాలామంది హీరోస్ వారి సినిమాలలో వాడుకున్నారు. ఈ సీన్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం డైరెక్ట‌ర్‌ ఐడియాన‌ట‌. ఈ సీన్ భూమిక న‌డుము చూసే వాళ్లకి ఎలాగైనా సరే కనెక్ట్ అవ్వాలని ఉద్దేశంతో భూమికకి పియర్స్ సోప్ ఇచ్చి నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు..?

కానీ ఈ సీన్ రూపొందించే టైంకి నీ నడుము చాలా షైనింగ్ గా కనిపించాలి చూస్తే తల తల మెరిసిపోవాలి అంటూ డైరెక్టర్ చెప్పాడట. భూమిక పియర్స్‌ సోప్‌ తీసుకుని నడుముని చాలాసేపు వాష్ చేసి షూటింగ్ టైంకి చాలా షైనింగ్ గా కనిపించేలా చేసిందట. దీంతో ఈ సీన్ సినిమాకి హైలెట్ అయింది. ఇప్పటికి కూడా భూమిక న‌డుము సీన్‌కి ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో భూమిక నడుము షైనింగ్‌గా కనిపించడానికి పియర్స్‌ సోప్ కారణమా అంటూ.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్స్‌.