ర‌జ‌నీ ‘ జైల‌ర్‌ ‘ పై ఇండియ‌న స్టార్ క్రికెట‌ర్ అమేజింగ్ రివ్యూ..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన మూవీ జైలర్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ మూవి ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తు మంచి క్రేజ్ సంపాదించుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై ఇండియన్ స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా ఓ రివ్యూను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

ఈ సినిమా చూసి బయటకు వచ్చాక ఎంతో ఎక్సైట్ అయ్యానని సినిమా నాకు చాలా చాలా నచ్చేసింది అంటూ రాసుకొచ్చాడు. సినిమా ఎంతో బాగా ఎంజాయ్ చేశాను అంటూ.. సూపర్ స్టార్ ఇస్ బెస్ట్‌.. నెల్సన్ మళ్లీ ప్రూవ్ చేసుకున్నావ్ అంటూ ప్ర‌సంస‌ల వ‌ర్షం కురిపించాడు.

తన డార్క్ హ్యూమర్ చాలా బాగుంది అంటూ వివరించాడు. అంతేగాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ వివరించాడు. చివరగా టైగర్ కా హుకుమ్‌ అంటూ తన ఎక్సైజ్మెంట్ తెలియజేశాడు దినేష్ కార్తీక్. దీంతో డేరింగ్ క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ రివ్యూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.