‘ భోళాశంక‌ర్ ‘ డే 1 వ‌సూళ్లు… అస‌లు ఇది చిరు సినిమాయేనా…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించిన మూవీ బోళాశంకర్. మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరూ చెల్లెలు రోల్‌ని ప్లే చేసింది. శ్రీముఖి, హైపర్ ఆది కీరోల్స్‌లో నటించిన ఈ సినిమా లేటెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు మంచి హైప్‌తో రిలీజైన‌ సంగతి తెలిసిందే.

మెగాస్టార్ ఫ్యాక్టర్ తో ఓపెనింగ్స్ వరకు ఓకే అన్నట్లు. డే 1 కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు నైజం లో డీసెంట్ నెంబర్స్ ను అందుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమా రూ.4.51 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టిందట. ఇది ఈ సినిమాకు వచ్చిన చాలా పూర్ అండ్ మిక్స్డ్ టాక్ తో సాలిడ్ కలెక్షన్ అనే చెప్పాలి. నిన్న ఉదయం టాక్‌ తో సంబంధం లేకుండా ఫస్ట్ అండ్ సెకండ్ షోస్ లో అద‌రకొట్టే ఫీలింగ్స్ నమోదు చేసుకుంది బోళా శంకర్.

ఫస్ట్ డే కి రికార్డ్ కలెక్షన్స్ కాకపోయినా డీసెంట్ నెంబర్ ని అందుకుంది. ఇక బోళా శంకర్ మూవీ కలెక్షన్స్ తెలిసిన చాలామంది ఇంత పూర్ కలెక్షన్స్ తో బోళా శంకర్ మూవీ నా.. అసలు ఇది చిరు సినిమా నేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వయసుకు తగ్గ సినిమాను ఎంచుకోకుండా.. ఇలా హీరోయిన్స్‌తో ఎగురుతూ కామెడీ ఫ్యాక్టర్ సినిమాల్లో నటిస్తే రెస్పాన్స్ ఇలానే ఉంటుందంటూ కొంతమంది మెగా హటర్స్ కామెంట్స్ చేస్తున్నారు.