వీధి పిల్లి దాడిలో గాయపడ్డ స్టార్ హీరోయిన్.. చాలా దారుణం కదా..!

బిగ్‌ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఒక్కసారిగా లైమ్‌ లైట్ లోకి వచ్చిన యువ నటి రైజా విల్సన్. వీధి పిల్లి దాడిలో గాయపడింది. ఈ దాడిలో ఆమె చేతికి ఘాటు పడింది. దీనితో హాస్పటల్ కి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ వీధి పిల్లి దాడిలో తన చేతికి గాయాలయ్యాయని తెలిపింది. దీనిని చూసిన తన‌ అభిమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ తర్వాత ఈమె “ప్యార్ ప్రేమ కాదల్”సినిమా ద్వారా వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత వర్మ, కాఫీ విత్ కాదల్ వంటి సినిమాల్లో నటించిన రైజా ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తుంది. ఇంతక ముందు ఆమె పేరు ఇలాంటి విషయంలోనే వైరల్ అయింది. ఫేషియల్ చేపించుకోవడానికి వెళ్లిన బ్యూటీ పార్లర్ లో జరిగిన సంఘటనతో ఆమె ఫేస్ అంతా వాచిపోయి, కమిలిపోయినట్లుగా అయిపోయింది. ఆ టైంలో సోషల్ మీడియాలో అంతా ఆమె గురించే వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో వీధి పిల్లి విషయంలో ఆమె పేరు మారుమోగుతుంది.

ఎప్పుడూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఇలా చేస్తుందేమో అంటున్నారు నెటిజన్స్. ఇక బ్యూటీ పార్లర్, వీధి పిల్లి గురించి పక్కన పెడితే సోషల్ మీడియాను మాత్రం తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్స్ కు హీట్ పుట్టిస్తుంది. ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన ఫోటోలకు విపరీతంగా లైకులు వచ్చి పడతాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పరంగా ఆమె ఓ పెద్ద సెలబ్రిటీ కిందే లెక్క.