ఆ హీరోతో తిరిగి క‌డుపు తెచ్చుకున్న `లైగ‌ర్‌` బ్యూటీ.. అబార్షన్ కూడా అయిందా?

నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య పాండే గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీ అయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌`తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవాల‌ని ఆశ‌ప‌డింది. కానీ, లైగ‌ర్ డిజాస్ట‌ర్ అవ‌డంతో ఆమెకు నిరాశే ఎదురైంది.

దాంతో అన‌న్య మ‌ళ్లీ బాలీవుడ్ లో సినిమాల‌తోనే బిజీ అయింది. ఇదంతా ప‌క్క‌న పెడితే.. ఈ బ్యూటీకి సంబంధించి ఓ షాకింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌, అనన్య పాండే ల‌వ్ లో ఉన్నార‌ని.. ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని బాలీవుడ్ కోడై కూస్తున్న సంగ‌తి తెలిసిందే. లాస్ట్ ఇయర్ దివాళీ పార్టీకి తొలిసారి జంటగా వచ్చిన ఆదిత్య‌, అన‌న్య‌… ఆ తరువాత చాలా సందర్భాల్లో జంట‌గా ద‌ర్శ‌న‌మిచ్చారు. అలాగే ఇటీవ‌ల వీరిద్ద‌రూ క‌లిసి వెకేష‌న్ కోసం స్పెయిన్ కు వెళ్లారు. అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని బ‌య‌ట‌కు రావ‌డంతో.. వీరి ల‌వ్ దాదాపు క‌న్ఫార్మ్ అయింది.

అయితే ఇదే త‌రుణంలో ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఉమైర్ సంధు చేసిన ట్వీట్ సంచ‌ల‌నం రేపుతోంది. ఇంత‌కుముందు సినిమాల రిలీజ్ టైమ్ లో రివ్యూస్ ఇచ్చే ఇతగాడు.. ఇప్పుడు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పై ఫోక‌స్ పెట్టి ఇష్టం వ‌చ్చిన‌ట్లు ట్వీట్ చేస్తున్నారు. తాజాగా అన‌న్య పాండేను టార్గెట్ చేశాడు. `అనన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ తో తిరిగి ప్రెగ్నెంట్ అయింది. దాంతో ఇటీవల ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆమె అబార్షన్ చేయించుకుంది.` అంటూ ఉమైర్ త‌న ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కాస్త వైర‌ల్ గా మార‌డంతో.. ఆదిత్య‌, అన‌న్య ఫ్యాన్స్ ఉమైర్ ను ఏకేస్తున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం సెల‌బ్రెటీల‌కు ఇది కామ‌నేగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.