రీ రిలీజై ఫస్ట్ డే అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే..!

సాధారణంగా గతంలో తెలుగులో పాత సినిమాల్లో రీ రిలీజ్‌ చేస్తూ ఉండేవాళ్లు. సాటిలైట్ డిజిటల్ ఎంట్రీ అవ్వడంతో వాటి క్రేజ్‌ తగ్గింది. తాజాగా టాలీవుడ్ లో మళ్ళీ పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్‌ స్టార్ట్ అయింది. ఈ మధ్య పాత సినిమాలు రీమాస్టర్ చేసి 4kలో మరోసారి విడుదల చేస్తున్నారు. అలా ఘరానా మొగుడు, పోకిరి, జల్సా, బిల్లా, చెన్నకేశవరెడ్డి, ఖుషి, సింహాద్రి, బిజినెస్ మేన్, తొలిప్రేమ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి. హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ టెన్ సినిమాలేవో ఒకసారి చూద్దాం.

బిజినెస్ మేన్ :
సూపర్ స్టార్ మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన బిజినెస్ మేన్ మూవీ రిలీజై మొదటి రోజు పాన్ ఇండియా లెవెల్ లో రూ.5.3 కోట్ల కలెక్షన్స్ కల్లగొట్టింది.

ఖుషి :
పవన్ కళ్యాణ్ – భూమిక హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫస్ట్ రోజు రూ.4.51 కోట్ల వ‌సూళ్ళు తం చేసుకుంది.

సింహాద్రి :
ఎన్టీఆర్ – రాజమౌళి కాంబోలో వచ్చిన సింహాద్రి మూవీ మొదటి రోజు రూ4.01 కోట్ల కలెక్షన్లను సాధించింది.

జల్సా :
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన జల్సా మూవీ రీ రిలీజై మొదటి రోజు రూ.3.0 కోట్ల సొంతం చేసుకుంది.

ఒక్కడు :
మహేష్ బాబు – భూమిక హీరో, హీరోయిన్లుగా గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందిన ఒక్కడు మూవీ మొదటి రోజు రూ.2.05 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది.

ఈ నగరానికి ఏమైంది :
విశ్వక్‌సేన్‌ మెయిన్‌ లీడ్ గా రూపొందిన ఈ సినిమా 1.78 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

పోకిరి :
మహేష్ బాబు – ఇలియానా హీరో , హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ రీరిలీజై మొదటి రోజు రూ1.73 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

ఆరెంజ్ :
అల్లు అర్జున్ – హన్సిక కాంబినేషన్లో వచ్చిన దేశముదురు మూవీ ఫస్ట్ డే రూ1.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

సూర్య సన్నాఫ్ కృష్ణన్ :
తమిళ్ స్టార్ హీరో సూర్య తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్ పోషించిన మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్. గౌతమ్ వాసుదేవమీనన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకి ఫస్ట్ డే రూ1.45 కోట్లు సంపాదించింది.