టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటన గురించి అందం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. బొద్దుగా ఉన్నప్పటికీ తన అందచందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ అప్పటి యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు. గతంలో హీరో తరుణ్ తో ప్రేమలో పడి ఆ ప్రేమ ఫెయిల్ కావడం వల్ల ఇమే సూసైడ్ వరకు వెళ్లిందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులు చూపించిన వాడిని పెళ్లి చేసుకొని తన భర్తతో కలిసి ఉండలేక విడాకులు ఇచ్చి మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే అప్పటికె ఆర్తి అగర్వాల్ బరువు పెరిగిపోవడంతో లైపోజషన్స్ అనే ఆపరేషన్ చేయించుకొని అది సక్సెస్ కాలేకపోవడంతో ఈమె మరణించిందని వార్తలు వినిపించాయి. ఆర్తి అగర్వాల్ సినీ కెరియర్ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలానే ఇబ్బందులను ఎదుర్కొందని ఇప్పటికీ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ జీవితంలో చాలా నరకం అనుభవించడానికి కారణం తన సొంత తండ్రి అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత చంటి అడ్డాల పలు విషయాలను తెలియజేయడం జరిగింది.
చంటి అడ్డాల మాట్లాడుతూ తాను ప్రొడ్యూస్ చేసిన అల్లరి రాముడు, అడవి రాముడు రెండు సినిమాలలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిందట.. అల్లరి రాముడు చిత్రంలో ముందుగా చార్మిని హీరోయిన్గా అనుకుంటే ఎన్టీఆర్ లావుగా ఉన్నారు ఛార్మి కూడా లావుగా ఉంటే ఈ సినిమా సక్సెస్ అవ్వదని డైరెక్టర్ గోపాల్ చెప్పారట.. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ ని అందులో తీసుకున్నామని తెలిపారు.
ఆ తరువాత అడవి రాముడు సినిమాలో కూడా ఆర్తి అగర్వాల్ ఛాన్స్ అందుకుంది. ఆ సమయంలోనే తనతో స్నేహబంధం ఏర్పడిందట. ఆర్తి అగర్వాల్ జీవితంలో తన తండ్రి సరిగ్గా చూసుకొని ఉండి ఉంటే ఆమెకు కష్టాలు ఉండేవి కావు.. తండ్రి వల్లే ఆర్తి అగర్వాల్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంది షూటింగ్ సమయంలో ఆమెను సరిగ్గా సహకరించేవారు కాదు ఆర్తి అగర్వాల్ కూడా తన తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ ఉండేది.. అందుచేతనే ఆర్తి అగర్వాల్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని గతంలో చంటి అడ్డాల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు..