7 డిఫ‌రెంట్ రోల్స్‌లో మెగాప‌వ‌ర్‌స్టార్‌…. ఆ రోల్స్ చూస్తే ఫ్యీజులు ఎగ‌రాల్సిందే..!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన రామ్ చరణ్ అదే రేంజ్‌లో న‌టిస్తున్న మరో సినిమా గేమ్ చేంజర్. శంకర్ డైరెక్టర్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. ఈ మూవీ ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దర్శకుడు శంకర్ తన మార్క్ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడని ఒక్క పాట కోసమే రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నానంటూ క్లైమాక్స్‌లో 500 మందితో ఫైట్ ఉండబోతుంది అంటూ పలు రకాల వార్తలు వైరల్‌ అయ్యాయి. తాజాగా రామ్‌చ‌ర‌ణ్‌కి సంబందించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నాడట. తన సినిమాలో హీరోలకు కథలు తగ్గట్టుగా మలిచి వినూత్న గెటప్స్‌లో చూపించడం శంకర్ కు అన‌వాయితీ.

ఇదే ఆనవాయితీని గేమ్ చేంజర్ మూవీలో కూడా శంకర్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాల్లో రామ్‌చరణ్ 7 డిఫరెంట్ గెటప్స్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. సామాజిక సమస్యలను డిస్కస్ చేయడంతో పాటు వాటిని పరిష్కరించే మార్గాలను చూపించే వాడిగా రామ్ చరణ్ పాత్ర సాగబోతుందట. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, జయరాం, సముద్రఖ‌ని, శ్రీకాంత్ లాంటి తదితరులు కీరోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి.