ఉడికించిన గుడ్లని నిల్వ ఉంచితే….. ఏమవుతుందో తెలుసా….!!

గుడ్డులో ఉండే పోషకాలు వల్ల డాక్టర్స్ కూడా రోజుకు ఒక గుడ్డు తినమని చెబుతున్నారు. కోడిగుడులో పోషకాలు, అనేక వ్యాధుల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు మనలో చాలామంది గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమంది కోడిగుడ్డును పాలల్లో కలుపుకుని తాగుతారు. మరి కొంతమంది కూరగా చేసుకుని తింటారు.

మరి కొంతమంది ప‌చ్చి గుడ్డును కూడా ఉంటారు. మనలో చాలామందికి ఉడికించిన గుడ్డిని ఎంత సమయంలో తినాలో అని విషయంలో సందేహం ఉంటుంది. చాలామంది గుడ్డును ఉదయం ఉడికించి సాయంత్రం సమయంలో తింటూ ఉంటారు. లేదంటే ఒక్కరోజు ఉడికించుకుని మరో రోజు కి ఫ్రిజ్లో పెట్టుకుని తింటూ ఉంటారు.

కోడి గుడ్డును ఉడికించిన తర్వాత రెండు లేదా మూడు గంటల లోపు తింటే మంచిదని సైంటిస్టులు చెప్తున్నారు. కోడిగుడ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సరైన రీతిలో వాడితేనే వాటిలో ఉన్న పోషకాలు మనకు అందుతాయి. సరిగ్గా వాడకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఉడకపెట్టిన రెండు లేదా మూడు గంటల్లో తినేయండి.