అలాంటి వాడే నాకు భ‌ర్త‌గా రావాలంటున్న పూజా హెగ్డే.. వింటున్నారా అబ్బాయిలు?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డినా.. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. పూజా ఉంటే సినిమా హిట్టే అనేంత‌లా పేరు తెచ్చుకుంది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. టాప్ హీరోలే కాదు టైర్ 2 హీరోలు కూడా పూజా హెగ్డే మాకొద్దు బాబోయ్ అంటున్నారు.

ఒక‌టి కాదు రెండు కాదు గ‌త ఏడాది నుంచి ఏకంగా అర‌డ‌జ‌న్ ఫ్లాపులను పూజా హెగ్డే మూట‌గ‌ట్టుకుంది. దీంతో గోల్డెన్ లెగ్ అన్న‌వారే ఆమెను ఐర‌న్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. చేతిలో ఉన్న రెండు, మూడు ప్రాజెక్ట్ లు కూడా చేజారాయి. పూజా హెగ్డే ఇప్పుడు ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని ఆశ‌ప‌డుతోంది. ఇదంతా ప‌క్క‌న పెడితే.. తాజాగా ఈ బ్యూటీ త‌న‌కు కాబోయే భ‌ర్త ఎలా ఉండాలో చెబుతూ కొన్ని కామెంట్స్ చేసింది.

`న‌న్ను అన్ని రకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను. నేను చాలా సాఫ్ట్‌. అందువ‌ల్ల నాకు సంబంధించి ప్ర‌తి విషయంలో జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలి. అతను నాకు స్ఫూర్తిగా నిలవాలి. న‌న్ను, నా వృత్తిని గౌర‌వించాలి. నా కెరీర్‌ని ప్రోత్సహించాలి. అలాంటి వాడే నాకు భ‌ర్త‌గా రావాలి` అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. మ‌రి అలాంటి అబ్బాయి పూజా పాప‌కు ఎప్ప‌టికి దొరుకుతాడో చూడాలి.